షావొమీ ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: చైనీస్ హ్యాండ్‌సెట్ దిగ్గజం షావొమీ తాజాగా తమ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంకి అప్‌గ్రేడెడ్ వెర్షన్ ‘ఎంఐయూఐ-7’ను ప్రవేశపెట్టింది. భారత్‌లో తాము విక్రయించిన స్మార్ట్‌ఫోన్స్ అన్నింటికి దీని బీటా వెర్షన్ ఆగస్టు 24న లభిస్తుందని షావొమీ గ్లోబల్ వీపీ హ్యూగో బరా తెలిపారు. ఇందులో విజువల్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, స్మార్ట్ ఎస్‌ఎంఎస్ ఫిల్టర్ మొదలైన ‘మేడ్ ఫర్ ఇండియా’ ఫీచర్లు ఉంటాయని ఆయన వివరించారు.