సూపర్ ‘స్మార్ట్’ఫోన్‌కు అయిదు చిట్కాలు | smart phone new five options | Sakshi
Sakshi News home page

సూపర్ ‘స్మార్ట్’ఫోన్‌కు అయిదు చిట్కాలు

Published Thu, Apr 17 2014 12:53 AM | Last Updated on Sat, Aug 18 2018 4:45 PM

సూపర్ ‘స్మార్ట్’ఫోన్‌కు అయిదు చిట్కాలు - Sakshi

సూపర్ ‘స్మార్ట్’ఫోన్‌కు అయిదు చిట్కాలు

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? వాడిన కొద్దీ ఫోన్ వేగం మందగిస్తోందా? బ్యాటరీ తరచూ డిస్‌ఛార్జ్ అయిపోయి చికాకుపెడుతోందా? ఈ సమస్యల పరిష్కారానికి ఉన్న అప్లికేషన్లలో ఏవి బాగుంటాయో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ కింది అప్లికేషన్లనూ ఓ సారి ప్రయత్నించి చూడండి...
 
 1. క్లీన్ మాస్టర్
 పేరులో ఉన్నట్లే స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండేటా చేస్తుంది. టెంపరరీ, వాడని ఫైల్స్‌తోపాటు, ఆపరేటింగ్ సిస్టమ్‌కు అక్కరకు రాని ఫైళ్లను కూడా తొలగించి ఫోన్ మరింత సమర్థంగా పని చేసేలా చేస్తుంది. తరచూ ఈ ఆప్లికేషన్‌ను వాడటం ద్వారా అనవసరమైన ఫైళ్లతోపాటు ర్యామ్ కూడా క్లియర్ అయిపోయి ఫోన్ స్మార్ట్‌గా పనిచేస్తుందన్నమాట.


 2. ఎయిర్ డ్రాయిడ్
 ఫోన్ నుంచి పీసీ, టాబ్లెట్‌లకు ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు మేలైన మార్గమీ అప్లికేషన్. పీసీ, లేదా టాబ్లెట్‌లోనూ ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. ఐపీ అడ్రస్‌తో కనెక్ట్ అవడం ద్వారా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్‌తోపాటు అప్లికేషన్లను మేనేజ్ చేసుకోవచ్చు. పీసీ బ్రౌజర్ ద్వారా పనిచేసే అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ద్వారానే మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చు.


 3. గ్రీనిఫై...
 బ్యాటరీ పొదుపు చేసుకోవాలంటే గ్రీనిఫై అప్లికేషన్ దానికో మార్గం చూపుతుంది. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లన్నింటినీ దాదాపుగా నిలిపేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. పెద్దగా అవసరం లేని అప్లికేషన్లను గుర్తిస్తే అవి స్లీప్ మోడ్‌లోనే ఉండేలా చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ ఆదా అవడమే కాకుండా డేటా ఛార్జీలు పెరక్కుండా చేస్తుంది. గ్రీనిఫై తాజా వెర్షన్ రూట్ యాక్సెస్ అవసరం లేకుండా పనిచేస్తుంది కాబట్టి దాదాపు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లపై దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.


 4. టైటానియం బ్యాకప్ ప్రొ...
 స్మార్ట్‌ఫోన్‌లోని డేటా, అప్లికేషన్లనింటినీ బ్యాకప్ చేసుకునేందుకు మెరుగైన అప్లికేషన్ ఇది. అయితే ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌కు రూట్ యాక్సెస్ అవసరం ఉంటుంది. మీరు ఫోన్ మార్చినా... పాత ఫోన్‌లోని అన్ని అప్లికేషన్లు, డేటాను నేరుగా ఇంపోర్ట్ చేసుకునే సౌలభ్యం చేకూరుతుంది ఈ అప్లికేషన్‌తో. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ అప్లికేషన్ ధర రూ.413.


 5. రూట్ బ్రౌజర్...
 మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫైల్ మేనేజర్ అప్లికేషన్ లాంటిది ఇది. ఫైల్స్‌ను అటు ఇటు మార్చేందుకు, డిలీట్  చేసేందుకు, జిప్‌ఫైల్స్‌లా మార్చేందుకు ఉపయోగించవచ్చు. మీకిష్టం వచ్చిన రీతిలో ఫైల్స్‌ను సార్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement