బుర్రకు పనిచెప్పే లుమోసిటీ...
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లలో మన జ్ఞానాన్ని పెంచేవి.. బుర్రకు పనిచెప్పేవి ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది లుమోసిటీ. మీ వయసుతోపాటు విద్య స్థాయిని బట్టి మీ మేధను పరీక్షించే క్విజ్‌లు, సాధారణ గణితశాస్త్ర ప్రశ్నలను సంధిస్తూ సమాధానాలు రాబట్టడం ఈ అప్లికేషన్ ఉద్దేశం. దీనిద్వారా జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అటెన్షన్ స్పాన్ కూడా ఎక్కువ అవుతుందని అంచనా. ప్రాథమిక వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. కొంచెం అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ ఎక్సర్‌సైజ్‌లు కావాలంటే మాత్రం రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
మ్యాజిక్యామ్...
కెమెరా ప్లస్ వంటి అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన బృందం తాజాగా అందుబాటులోకి తెచ్చిన కెమెరా అప్లికేషన్ ఈ మ్యాజిక్యామ్. దీంట్లోని తొమ్మిది ‘మూడ్స్’తో ఫొటోలపై రకరకాల ఫిల్టర్లను అప్లై చేసి అందంగా తీర్చిదిద్దవచ్చు. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఆపిల్ ఐఫోన్‌తో మాత్రమే పనిచేస్తుంది. కొంత రుసుము చెల్లించడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఇప్పటికే కొన్ని ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
ఎవిరీపోస్ట్...
స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఏకకాలంలో అనేక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేయాలనుకునేవారికి ఎవిరీపోస్ట్ భేషైన అప్లికేషన్. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, లింక్డ్‌ఇన్, టంబ్లర్ వంటి సోషల్ సైట్లకు ఫోటోలు, వీడియోలతోపాటు టెక్స్ట్ సందేశాలను కూడా పోస్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. ఈమెయిళ్ల ద్వారా కూడా పోస్ట్ చేయగలగడం మరో ప్రత్యేకత. ట్విట్టర్‌లోని 140 పదాల పరిమితిని అధిగమించేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అన్నింటికీ పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా నచ్చిన టంబ్లర్, పింటరెస్ట్ బ్లాగ్‌లకూ మీ సందేశాలను చేరవేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
భలే ఆప్స్
Published Wed, Jun 25 2014 11:25 PM | Last Updated on Sat, Aug 18 2018 4:45 PM
Advertisement