
ఫొటో చూసిన వెంటనే విషయం తెలిసిపోతుంది. స్మార్ట్‌ఫోన్ కేసులో ఇమిడిపోయే ఓ కెమెరా.. ఎక్కడ పడితే అక్కడ దాన్ని అతికించుకునే వీలు.. తద్వారా సెల్ఫీలకు ఒక కొత్త అర్థం. ఇదీ ఎవో గోక్యామ్ ప్రత్యేకతలు. వైర్‌లెస్ కెమెరా ఉండే ఈ సెల్ఫీ స్టిక్‌ను ఐఫోన్‌లతోపాటు కొన్ని హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లతో మాత్రమే పనిచేస్తుంది. సిలికోన్‌తో తయారైన ఎవో గోక్యామ్ కేవలం ఆరు మిల్లీమీటర్ల మందం ఉంటుంది. వైఫై ద్వారా ఫొటోలు తీయవచ్చు. మొత్తం 5 మెగాపిక్సెల్స్ రెజల్యూషన్, 1080పిక్సెల్స్/30 ఫ్రేమ్స్ పర్ సెకన్ వేగంతో వీడియోలు తీయవచ్చు.
ఫొటోలు, వీడియోలు మొత్తం మన ఫోన్‌లోని ఎస్‌డీ కార్డులో స్టోర్ అవుతాయి. దాదాపు 150 అడుగుల దూరం నుంచి కూడా ఈ కెమెరా పనిచేస్తుంది. ప్రత్యేకమైన యాప్ ద్వారా కెమెరా లెన్స్ ఎటువైపు చూస్తోందో చూసుకోవచ్చు. మార్పులు చేసుకోవచ్చు కూడా. రికార్డు చేసిన ఫొటోలు, వీడియోలను వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియాల్లో షేర్ చేసుకోవచ్చు. అవసరమైతే రెండు మూడు ఎవో గోక్యామ్‌లను నెట్‌వర్క్ చేసుకుని వేర్వేరు కోణాల్లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకునే వీలుంది!
Comments
Please login to add a commentAdd a comment