selfie stick
-
ఫోన్లోనే సెల్ఫీ స్టిక్!
ఫొటో చూసిన వెంటనే విషయం తెలిసిపోతుంది. స్మార్ట్‌ఫోన్ కేసులో ఇమిడిపోయే ఓ కెమెరా.. ఎక్కడ పడితే అక్కడ దాన్ని అతికించుకునే వీలు.. తద్వారా సెల్ఫీలకు ఒక కొత్త అర్థం. ఇదీ ఎవో గోక్యామ్ ప్రత్యేకతలు. వైర్లెస్ కెమెరా ఉండే ఈ సెల్ఫీ స్టిక్‌ను ఐఫోన్లతోపాటు కొన్ని హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లతో మాత్రమే పనిచేస్తుంది. సిలికోన్‌తో తయారైన ఎవో గోక్యామ్ కేవలం ఆరు మిల్లీమీటర్ల మందం ఉంటుంది. వైఫై ద్వారా ఫొటోలు తీయవచ్చు. మొత్తం 5 మెగాపిక్సెల్స్ రెజల్యూషన్, 1080పిక్సెల్స్/30 ఫ్రేమ్స్ పర్ సెకన్ వేగంతో వీడియోలు తీయవచ్చు. ఫొటోలు, వీడియోలు మొత్తం మన ఫోన్లోని ఎస్డీ కార్డులో స్టోర్ అవుతాయి. దాదాపు 150 అడుగుల దూరం నుంచి కూడా ఈ కెమెరా పనిచేస్తుంది. ప్రత్యేకమైన యాప్ ద్వారా కెమెరా లెన్స్ ఎటువైపు చూస్తోందో చూసుకోవచ్చు. మార్పులు చేసుకోవచ్చు కూడా. రికార్డు చేసిన ఫొటోలు, వీడియోలను వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియాల్లో షేర్ చేసుకోవచ్చు. అవసరమైతే రెండు మూడు ఎవో గోక్యామ్లను నెట్వర్క్ చేసుకుని వేర్వేరు కోణాల్లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకునే వీలుంది! -
ముగ్గురి ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్
న్యూయార్క్: సరదాగా సెల్ఫీలు తీసుకునేందుకు ఉపయోగించే సెల్ఫీ స్టిక్ ఓ కుటుంబాన్ని కాపాడింది. సముద్రంలో ఈత కొడుతున్న వారిని ఓ రాకాసి అల మింగబోతుండగా దాని సాయంతో బయటపడ్డారు. మస్సాచుస్సెట్స్లోని సముద్రతీరం వెంబడి టెక్సాస్‌కు చెందిన డెర్రిక్ జాన్, ఆయన భార్య, కూతురు ఎరిన్(16) కాలక్షేపానికి వెళ్లిన వారు తీరపుఒడ్డున స్నానం చేసేందుకు దిగారు. వారిలో కూతురు హెరిన్ చేతిలో కెమెరాను సెల్ఫీ స్టిక్కు అమర్చి వీడియో తీస్తుండగా వారి వెనుక నుంచి ఒక్కసారిగా భారీ అల వచ్చి ముంచేసింది. దీంతో హెరిన్ తన చేతిలోని సెల్ఫీ స్టిక్‌ను సముద్రంలోకి జారిపోతున్న తల్లిదండ్రులకు అందించి కాపాడింది. దీంతో హమయ్య అంటూ వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
1926 నాటి సెల్ఫీ !
సెల్ఫీ.. దీని ప్రాచుర్యం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది దీనికి తోడు సెల్ఫీ స్టిక్ కూడా వచ్చింది. చాలా మంది ఈ సెల్ఫీ స్టిక్కు కెమెరా తగిలించి.. ఫొటోలు తీసుకోవడం మొదలెట్టారు. అయితే.. దీని వినియోగం అప్పట్లోనే ఉందట. దానికి నిదర్శనమే ఈ చిత్రం. బ్రిటన్‌లోని రగ్బీ పట్టణానికి చెందిన ఆర్నాల్డ్, హెలెన్ల జంట 1926లోనే సెల్ఫీ స్టిక్‌ను ఉపయోగించి.. క్లిక్‌మనిపించిన ఫొటో ఇదీ. ఈ ఫొటో చాన్నాళ్లూ తమ పాత ఆల్బంలలో ఉండిపోయిందని.. ఈ మధ్య వాటిని చూసినప్పుడు తాను ఆశ్చర్యపోయానని ఆర్నాల్డ్ మనవడు క్లీవర్ చెప్పారు. ‘మా తాతగారు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించేవారట. ఆయన సంగీతకారుడు. అసలు ఫొటో తీసుకోవడానికి స్టిక్‌ను వాడాలన్న ఆలోచన అప్పట్లో ఆయనకెలా వచ్చిందో తెలియదు’ అని క్లీవర్ చెప్పారు.