1926 నాటి సెల్ఫీ !
సెల్ఫీ.. దీని ప్రాచుర్యం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది దీనికి తోడు సెల్ఫీ స్టిక్ కూడా వచ్చింది. చాలా మంది ఈ సెల్ఫీ స్టిక్‌కు కెమెరా తగిలించి.. ఫొటోలు తీసుకోవడం మొదలెట్టారు. అయితే.. దీని వినియోగం అప్పట్లోనే ఉందట. దానికి నిదర్శనమే ఈ చిత్రం. బ్రిటన్‌లోని రగ్బీ పట్టణానికి చెందిన ఆర్నాల్డ్, హెలెన్‌ల జంట 1926లోనే సెల్ఫీ స్టిక్‌ను ఉపయోగించి.. క్లిక్‌మనిపించిన ఫొటో ఇదీ.
ఈ ఫొటో చాన్నాళ్లూ తమ పాత ఆల్బంలలో ఉండిపోయిందని.. ఈ మధ్య వాటిని చూసినప్పుడు తాను ఆశ్చర్యపోయానని ఆర్నాల్డ్ మనవడు క్లీవర్ చెప్పారు. ‘మా తాతగారు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించేవారట. ఆయన సంగీతకారుడు. అసలు ఫొటో తీసుకోవడానికి స్టిక్‌ను వాడాలన్న ఆలోచన అప్పట్లో ఆయనకెలా వచ్చిందో తెలియదు’ అని క్లీవర్ చెప్పారు.