సీఎం మీతో మాట్లాడతారట.. | andhra pradesh cmo officers phone call to farmers | Sakshi
Sakshi News home page

సీఎం మీతో మాట్లాడతారట..

Published Wed, Dec 3 2014 1:06 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

సీఎం మీతో మాట్లాడతారట.. - Sakshi

సీఎం మీతో మాట్లాడతారట..

హైదరాబాద్ : నయానో...భయానో రైతులను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ యత్నిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని గ్రామాల రైతులకు సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయి. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదన్న వారిని ...హైదరాబాద్ రావాలని సీఎంవో అధికారులు ఆహ్వానిస్తున్నారు.

మంగళవారం రాత్రి సుమారు 20మంది రైతు నాయకులకు ఫోన్లు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడతారట...అంటూ  వెంకటపాలెం, నెడమర్రు, నందడం, ఉద్దండరాయునిపాలెం రైతులను ఫోన్లలో సమాచారమిస్తున్నారు. కాగా భూములు ఇవ్వనన్న రైతులతో గురువారం.. చంద్రబాబు చర్చలు జరిపి వారిని బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement