
న్యూఢిల్లీ: లావా ఇంటర్నేషనల్ తాజాగా తమ జెడ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్స్ శ్రేణిని ఆవిష్కరించింది. జెడ్60, జెడ్70, జెడ్80, జెడ్90 వంటి నాలుగు ఫోన్లు దీన్లో ఉన్నాయి. వీటి ధర రూ. 5,500 నుంచి రూ. 10,750 దాకా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు కంపెనీ మనీ బ్యాక్ చాలెంజ్‌ను కూడా ప్రకటించింది.
ఈ ఆఫర్ కింద ఫోన్ కొనుక్కున్న కస్టమర్లు.. ఏ కారణం చేతనైనా అది నచ్చకపోయిన పక్షంలో 30 రోజు ల్లోగా వాపసు చేసి, తాము చెల్లించిన సొమ్మును వెనక్కి పొందవచ్చు. అక్టోబర్ 1 నుంచి డిసెంబ ర్ 31 దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుం దని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ విభాగ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మహాజన్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ రైనా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment