హైదరాబాద్: ఇంటెక్స్ మొబైల్స్ కంపెనీ రెండు మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. 5 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆక్వా ఐ-7లో డ్యుయల్ కెమెరా(13 ఎంపీ, 5 ఎంపీ), 32జీబీ ఇంటర్నల్ మెమెరీ, 3జీ వీడియో కాలింగ్ వంటి ఫీచర్లున్న ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 5,500 వాల్యూపాక్(2.1 బ్లూటూత్ స్పీకర్) ఉచితమని కంపెనీ పేర్కొంది. ఇక ఆక్వా హెచ్‌డీ ఫోన్‌లో 4.7 అంగుళాల స్క్రీన్, డ్యుయల్ కెమెరా(13 ఎంపీ, 5 ఎంపీ), 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 3జీ వీడియో కాలింగ్ ఉన్న ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఫర్హాన్ ఆటోగ్రాఫ్ చేసిన పెన్, కీ చెయిన్ సెట్ ఉచితమని పేర్కొంది. ఈ ఉచిత ఆఫర్లు పరిమిత కాలం వరకేనని వివరించింది.
మార్కెట్లోకి ఇంటెక్స్ మొబైల్ ఫోన్లు
Published Sun, Sep 29 2013 1:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement