భారత్‌లో తొలి ‘ఆక్టా-కోర్’ మొబైల్
న్యూఢిల్లీ: ఇంటెక్స్ కంపెనీ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రూపొందించిన తొలి మొబైల్ ఫోన్.. ‘ఆక్వా ఆక్టా’ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.19,999 అని ఇంటెక్స్ టెక్నాలజీస్ బిజినెస్ హెడ్ (మొబైల్) సంజయ్ కుమార్ కలిరోణ చెప్పారు. మీడియా టెక్ అందించిన ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను రూపొందించామని పేర్కొన్నారు. ఈ ప్రాసెసర్ అత్యధిక వేగం(1.7 గిగాహెర్ట్జ్)తో పనిచేస్తుందని, వీడియో, గేమింగ్‌లను అత్యధిక స్పీడ్‌తో యాక్సెస్ చేయవచ్చని వివరించారు. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ (జీఎస్ఎం, సీడీఎంఏ)ఫోన్లో ఆరు అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 ఎంబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 జీబీ క్లౌడ్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది ఆక్వా సిరీస్‌లో ఎనిమిది మోడళ్లను మార్కెట్లోకి తెచ్చామని సంజయ్ వివరించారు.