పలు చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే భారత మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. భారత్‌లో మరింత విస్తరించేందుకుగాను ఇక్కడే ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పలు అమెరికన్ కంపెనీలు పావులు కదుపుతున్నాయి. తాజాగా అమెరికన్ ప్రముఖ టీవీ తయారీ సంస్థ వెస్టింగ్ హౌజ్ భారత మార్కెట్లలోకి ‘మేడ్ ఇన్ ఇండియా’ టీవీలను లాంచ్ చేసింది. భారత్‌లో వెస్టింగ్‌హౌజ్ టీవీలను ఎస్‌పీపీఎల్ తయారుచేయనుంది. వెస్టింగ్‌హౌజ్ భారత్‌కు చెందిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌పీపీఎల్)తో ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..!
లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం..వెస్టింగ్‌హౌస్ తయారీ, బ్రాండింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, ఎస్‌పీపీఎల్ నిర్వహించనుంది. వెస్టింగ్‌హౌజ్ ఉత్పత్తులు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. కొత్తగా ప్రారంభించిన 'డబ్ల్యూ- సిరీస్' ధరలు రూ. 7,999 నుంచి మొదలవుతాయి . ఈ సిరీస్‌లో 24-అంగుళాల నాన్-స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ, 4 స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మోడళ్లు ఉన్నాయి. 32-అంగుళాల హెచ్‌డీ రెడీ, 40-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ, 43-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ, 55-అంగుళాల యూహెచ్‌డీ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల కొనుగోలుపై 10శాతం తక్షణ తగ్గింపును ప్రకటించింది.
- 24-అంగుళాల నాన్-స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ధర రూ. 7999.
- 32-అంగుళాల హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీ ధర రూ. 12,999.
- 40-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 18,999.
- 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టీవీ ధర రూ. 20, 999. 32,40,43 అంగుళాల మోడల్స్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్నాయి. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కల్గి ఉన్నాయి.
- 55-అంగుళాల మోడల్ ధర రూ.32,999. 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నేల్ స్టోరేజ్‌ను కల్గి ఉంది.
అన్ని స్మార్ట్ టీవీ మోడళ్లలో 5.0 బ్లూటూత్, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, 3హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లు. ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ 5, సోనీ ఎల్ఐవి, గూగుల్ ప్లే స్టోర్ వంటి 500,000 ప్లస్ టీవీ షోలతో సహా గేమ్‌లకు మద్దతు ఇచ్చే అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్ అండ్ ఎయిర్‌ప్లేను పొందుతారు.
చదవండి: కంగుతిన్న మైక్రోసాఫ్ట్..! భారీగా షాకిచ్చిన యూజర్లు..!
Comments
Please login to add a commentAdd a comment