క్యూఎల్‌ఇడి 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ | Mi QLED TV 4K With Dolby Vision Launched in India | Sakshi
Sakshi News home page

క్యూఎల్‌ఇడి 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ

Published Wed, Dec 16 2020 7:21 PM | Last Updated on Wed, Dec 16 2020 7:27 PM

Mi QLED TV 4K With Dolby Vision Launched in India - Sakshi

న్యూఢిల్లీ: 55 అంగుళాల క్యూఎల్‌ఇడి అల్ట్రా-హెచ్‌డి స్క్రీన్‌తో గల స్మార్ట్ టీవీని షియోమీ భారతదేశంలో విడుదల చేసింది. ఎంఐ క్యూఎల్‌ఇడి 4కే మోడల్ ‌టీవీని భారత్ లో మొదటిసారిగా పరిచయం చేసింది. ఈ స్మార్ట్ టీవీ 3840x2160 పిక్సెల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం 55-అంగుళాల సైజు ఆప్షన్‌లో లభిస్తుంది. ఎంఐ క్యూఎల్‌ఇడి 4కే టీవీ డిసెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, విజయ్ సేల్స్ సహా ఇతర రిటైల్ దుకాణాల ద్వారా ఫస్ట్ సేల్ కి రానుంది. దీని ధర వచ్చేసి రూ.54,999.(చదవండి: ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు)

ఎంఐ క్యూఎల్‌ఇడి 4కే టీవీ ఫీచర్స్: 
ఎంఐ క్యూఎల్‌ఇడి 4కే టీవీ 55 అంగుళాల అల్ట్రా-హెచ్‌డి(3840x2160) పిక్సెల్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది హెచ్‌ఎల్‌జి, హెచ్‌డిఆర్ 10, హెచ్‌డిఆర్ 10ప్లస్, డాల్బీ విజన్‌తో సహా వివిధ హెచ్‌డిఆర్ ఫార్మాట్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆండ్రాయిడ్ టీవీ లాంఛర్‌తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ ఎమ్‌టి 9611 క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. ఎంఐ క్యూఎల్‌ఇడి 4కే టీవీలో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 6 స్పీకర్స్ 30వాట్ సౌండ్ ఔట్‌పుట్ ఇస్తాయి. 3 హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. ఇందులో క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్‌గా వస్తుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 4కే రిజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఎంఐ క్యూఎల్‌ఇడి 4కే టీవీ బ్లూటూత్ 5, హెచ్‌డీఎంఐ ఈఏఆర్ సీ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో రిమోట్ లో కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, గూగుల్ అసిస్టెంట్‌ కోసం వేర్వేరు బటన్స్ ఉన్నాయి.       
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement