న్యూఢిల్లీ: షియోమీ తన స్మార్ట్ టీవీల ధరలను పెంచేసింది. సుమారు టీవీల ధరలు 3వేల వరకు పెరిగాయి. షియోమీ యొక్క ఎంఐ టీవీ 4ఏ, ఎంఐ టీవీ 4ఎక్స్, ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు షియోమీ యొక్క ఎంఐ.కామ్ వెబ్‌సైట్ లో కూడా కనిపిస్తున్నాయి. స్మార్ట్ టీవీల మీద పెరిగిన ధరలు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో కూడా వర్తిస్తుంది అని పేర్కొంది. గత నెలలో షియోమీ తమ స్మార్ట్ టీవీల ధరలను విడిభాగాల ధరలు పెరిగిన కారణంగా పెంచనున్నట్లు ప్రకటించింది.(చదవండి: శామ్‌సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ)
ఎంఐ టీవీ 4ఏ ప్రో 32-అంగుళాల ధర రూ.13,999 నుంచి రూ.14,999కి, ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 32అంగుళాల మోడల్ ధర రూ.14,999 నుంచి రూ.15,499కి పెరిగింది. అదేవిధంగా ఎంఐ టీవీ 4ఎ 43 అంగుళాల ధర రూ.22,499 నుంచి రూ.24,999కి పెరిగింది. ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 43 అంగుళాల వేరియంట్ ధర రూ.23,499 నుంచి రూ.25,999కి పెంచింది. షియోమీ ఎంఐ టీవీ 4ఎక్స్ 43అంగుళాల ధర రూ.25,999 నుంచి రూ.28,999కి పెంచింది. మరోవైపు ఎంఐ టీవీ 4ఎక్స్ 50 అంగుళాల ధర రూ.31,999 నుంచి రూ.34,999కి, ఎంఐ టీవీ 4ఎక్స్ 55 అంగుళాల టీవీ ధర రూ.36,999 నుంచి రూ.39,999కి పెంచింది. గడిచిన రెండేళ్లలో షియోమీ 50 లక్షల టీవీలను విక్రయించినట్లు గత నెలలో పేర్కొంది. దీంతోపాటు షియోమీ ఎంఐ క్యూఎల్ఈడీ టీవీని కూడా గత నెలలో లాంచ్ చేసింది. ఇందులో డాల్బీ విజన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment