Redmi Smart Tv 32 Smart Tv 43 With Dolby Audio Launched In India - Sakshi
Sakshi News home page

Redmi Smart TV: తక్కువ ధరల్లో స్మార్ట్‌టీవీ లాంచ్‌ చేసిన రెడ్‌మీ...!

Published Wed, Sep 22 2021 6:53 PM | Last Updated on Wed, Sep 22 2021 7:55 PM

Redmi Smart Tv 32 Smart Tv 43 With Dolby Audio Launched In India - Sakshi

భారత మార్కెట్లలో​​కి రెడ్‌మీ సరికొత్త స్మార్ట్ టీవీలను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు 32 అంగుళాల, 43 అంగుళాల సైజుల్లో ఉన్నాయి. రెడ్‌మీ లాంచ్‌ చేసిన స్మార్ట్‌టీవీలు ఆండ్రాయిడ్‌11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కల్గి ఉంది. గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, 20 వాటా స్పీకర్స్‌, డాల్బీ ఆడియోను ఈ స్మార్ట్‌టీవీలు కలిగి ఉన్నాయి. 32-అంగుళాల వేరియంట్ ధర రూ .15,999 కాగా, 43-అంగుళాల వేరియంట్ ధర రూ .25,999గా రెడ్‌మీ నిర్ణయించింది.

స్మార్ట్‌టీవీల అమ్మకాల తేదీని రెడ్‌మీ ఇంకా ప్రకటించలేదు. దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్‌టీవీలను రెడ్‌మీ విక్రయించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌టీవీలు ఎమ్‌ఐ. కామ్‌, అమెజాన్‌ సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. సేల్‌లో భాగంగా రెడ్‌మీ స్మార్ట్‌టీవీలపై అదనపు తగ్గింపుతో ప్రత్యేక ధరలకు అందించనుంది. 

రెడ్‌మీ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్‌లు

  • 43ఇంచ్‌ స్మార్ట్‌టీవీ, 32 ఇంచ్‌ స్మార్ట్‌టీవీ
  • హెచ్‌డీ డిస్‌ప్లే 
  • హెచ్‌డీఎమ్‌ఐ సపోర్ట్‌ 
  • యూఎస్‌బీ
  • ఈథర్‌నెట్‌ సపోర్ట్‌
  • డ్యూయల్-బ్యాండ్ వైఫై,
  • బ్లూటూత్ 5.0 
  • ఆటో లో లేటెన్సీ మోడ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement