Amazon Mobile And TV Savings Days Sale: Check Special Discount Offers - Sakshi
Sakshi News home page

Amazon Saving Sales: త్వరపడండి..! మొబైల్‌, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్‌..!

Published Sun, Jan 9 2022 1:05 PM | Last Updated on Sun, Jan 9 2022 2:43 PM

Amazon Mobile And TV Savings Days Sale Is On Check The Exciting Offers Here - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ ఇండియా మొబైల్ అండ్‌ టీవీ సేవింగ్స్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ జనవరి 7న ప్రారంభమవ్వగా...జనవరి 10 తో ముగియనుంది. సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్‌, టీవీ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్‌ ప్రకటించింది. స్మార్ట్‌టీవీలపై 48 శాతం వరకు డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపుతో గరిష్టంగా రూ. 1,000 వరకు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపును అమెజాన్‌ అందిస్తోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు అదనంగా ఆర్నెల్ల స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌, మూడు నెలల నోకాస్ట్‌ ఈఎంఐతో పాటుగా రూ. 20 వేల వరకు క్యాష్‌ బెనిషిట్స్‌ను పొందవచ్చును. ఈ సేల్‌ ముగిసిన వెంటనే అమెజాన్‌ ప్రీమియం ఫోన్ పార్టీ ఈవెంట్ జనవరి 12 మొదలుపెట్టనుంది. ఈ సమయంలో కస్టమర్‌లు తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.5వేల వరకు కూపన్‌ డిస్కౌంట్లను అమెజాన్‌ అందిస్తోంది. 

చదవండి: న్యూ ఇయర్‌ ఆఫర్‌: హోండా కార్లపై భారీ తగ్గింపు..!

మొబైల్ అండ్‌ టీవీ సేవింగ్స్ డే సేల్‌లో అమెజాన్‌ అందిస్తోన్న పలు ఆఫర్స్‌..!

► Mi 11X స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు రూ. 23,499కు లభించనుంది. Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ. 19,999కు రానుంది. వీటిపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. 

► Redmi 9A స్మార్ట్‌ఫోన్ 7,199 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. దీనిపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ కూడా రానుంది. 

► Samsung Galaxy S20 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను 46 శాతం తగ్గింపుతో రూ. 39,990కి కొనుగోలు చేయవచ్చు.

► OnePlus 9R స్మార్ట్‌ఫోన్ రూ. 33,999, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ 36,999 మరియు వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 54,999 కు రానుంది. 

► iQOO Z5ని రూ.21,990కి మరియు iQOO 7 స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,990కి కొనుగోలు చేయవచ్చు.

►  Realme Narzo 50A,  Samsung Galaxy M52 5G,  OnePlus Nord 2 5G స్మార్ట్‌ఫోన్లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్‌ కూపన్స్‌ను అమెజాన్‌ అందిస్తోంది. 

► AmazonBasics 50-అంగుళాల 4K TV 40 శాతం డిస్కౌంట్‌తో రూ. 32,999కు రానుంది. 

► Sony 50-inch 4K UHD Google స్మార్ట్‌టీవీ 30 శాతం డిస్కౌంట్‌తో రూ. 77, 990కు లభించనుంది.

► iFFalcon 43-inch 4K UHD స్మార్ట్‌టీవీ ఏకంగా 48 శాతం తగ్గింపును అమెజాన్‌ ప్రకటించింది. 

► Redmi TV 32 అంగుళాల HD Smart TVని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు.

► Mi 40inch Horizon FHD TVని రూ.6000 తగ్గింపుతో రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు.

చదవండి: బంపరాఫర్‌..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement