
సాక్షి, ముంబై : ఇటీవలే టెలివిజన్ మార్కెట్‌లో ప్రవేశించి సంచలనం సృష్టించిన షావోమి, ఈ మార్కెట్‌లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ. 40 వేలకు 55 అంగుళాల స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన ఈ కంపెనీ, మిండ్ రేంజ్ టీవీని రేపు(మార్చి 7) లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఓ టీజర్‌ను కూడా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. స్విచ్ఛ్‌టూస్మార్ట్, స్విచ్ఛ్‌టూస్టయిల్, స్విచ్ఛ్‌టూఎంటర్‌టైన్‌మెంట్ అనే పంచ్ లైన్లతో ఈ కొత్త సిరీస్ టీవీని లాంచ్ చేస్తోంది. 'ఎంఐ ఫ్యాన్స్! స్మార్టర్, స్లిమ్మర్, స్లీకర్‌గా మారడానికి ఇదే సరియైన సమయం. స్మార్ట్‌టీవీలోకి మారడానికి సమయం వచ్చేసింది. కొత్త సిరీస్ త్వరలో వచ్చేస్తోంది'' అని ఎంఐ ఇండియా ట్వీట్ చేసింది.
షావోమి తన దేశీయ మార్కెట్‌లో రెండు టీవీలను లాంచ్ చేసింది. ఒకటి ఎంఐ టీవీ 4సీ, రెండు ఎంఐ టీవీ 4ఏ. ముందస్తు రిపోర్టులను బట్టి షావోమి ఎంఐ 4ఏ సిరీస్‌లో 40 అంగుళాల టీవీను 17,500 రూపాయలకు లాంచ్ చేస్తుందని తెలిసింది. కానీ కంపెనీ వెబ్‌సైట్ తాజా లీకేజీల ప్రకారం ఎంఐ టీవీ 4సీ సిరీస్‌ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. రెండు సిరీస్‌లో ఈ స్మార్ట్‌టీవీ లాంచ్ అవుతుందని, 43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ రెజుల్యూషన్, 4కే రెజుల్యూషన్‌తో 55 అంగుళాల స్క్రీన్‌ను ఇది కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఎంఐ టీవీ4 లాగానే.. హెచ్‌డీఆర్ 10 సపోర్టు, హెచ్‌ఎల్‌జీ, వైఫై 802, డోల్బీ, డీటీఎస్ ఆడియో, బ్లూటూత్ 4.2 స్పెషిఫికేషన్లను కలిగి ఉంటుందని టాక్. రేపు ఈ లాంచ్ ఈవెంట్‌ను షావోమి నిర్వహించబోతుంది. కంపెనీ వెబ్‌సైట్లో మూడు గంటలకు దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. అదేవిధంగా తాజాగా లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 5 ప్రొ, రెడ్‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్లను కూడా షావోమి రేపు మధ్యాహ్నం విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment