మార్కెట్లోకి మోటొరొలా స్మార్ట్‌ టీవీ | Motorola Company to Launch a New Smart TV | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి మోటొరొలా స్మార్ట్‌ టీవీ

Published Tue, Sep 17 2019 3:43 AM | Last Updated on Tue, Sep 17 2019 3:43 AM

Motorola Company to Launch a New Smart TV - Sakshi

న్యూఢిల్లీ:  మోటొరొలా కంపెనీ భారత్‌లో తొలిసారిగా స్మార్ట్‌ టీవీని అందుబాటులోకి తెచి్చంది. అంతే కాకుండా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మొటొరొలా ఆండ్రాయిడ్‌ 9.0 స్మార్ట్‌ టీవీ ఏడు వేరియంట్లలో లభిస్తుందని, ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యంతో ఈ నెల 29 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని  మోటొరొలా మొబిలిటీ ఇండియా తెలిపింది. హెచ్‌డీ రెడీ, ఫుల్‌ హెచ్‌డీ, ఆల్ట్రా హెచ్‌డీ(4కే).. ఇలా ఏడు వేరియంట్లలో, 32 నుంచి 65 అంగుళాల సైజుల్లో లభించే ఈ స్మార్ట్‌ టీవీల ధరలు రూ.13,999 నుంచి ఆరంభమవుతాయని మొటొరొలా మొబిలిటీ ఇండియా హెడ్‌ ప్రశాంత్‌ మణి చెప్పారు.

ఈ స్మార్ట్‌ టీవీతో పాటు  మోటొ ఈసిక్స్‌ఎస్‌ పేరుతో కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని,  ధర రూ.7,999 అని కంపెనీ పేర్కొ న్నారు.  ఈ ఫోన్‌లో మీడియా టెక్‌ హెలియో పీ22 ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 13 మెగా పిక్సెల్‌ ప్లస్‌ 2 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్, 512 జీబీ అడిషనల్‌ స్టోరేజ్,  3,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement