Motorola company
-
మోటో వాచ్ 200 వచ్చేస్తోంది...ఫీచర్లు చూశారా!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా త్వరలోనే మోటో వాచ్‌లను లాంచ్ చేయనుంది. కొన్ని కీలక స్పెక్స్, డిజైన్లతో టెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను వెబ్సైట్లో వెల్లడించింది. మోటో స్మార్ట్‌వాచ్ లైనప్‌లో మోటోవాచ్ 70, మోటోవాచ్ 200 లిస్ట్ చేసింది. బడ్జెట్-సెంట్రిక్ వినియోగదారుల కోసం మోటో వాచ్ 70ని, ప్రీమియం ఫీచర్లతో మోటో వాచ్ 200 ద్వారా ప్రీమియం స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇస్తోంది. మోటో వాచ్ 200 ఫీచర్లు: డిస్ప్లే: 1.78 అంగుళాలు బ్యాటరీ: 355 ఎంఏహెచ్ (14 రోజుల వరకు) 5 ఏటియం వాటర్‌ప్రూఫ్; హార్ట్‌రేట్ మానిటర్ ఎస్పీవో2 మీటర్ బ్లూటూత్: 5.3 ఎల్ఈ; బిల్డ్–ఇన్ జీపిఎస్ మైక్రోఫోన్, స్పీకర్ కలర్స్: వార్మ్ గోల్డ్ అండ్ ఫాంటమ్ బ్లాక్. కంపెనీ ఇంకా ధరను వెల్లడించనప్పటికీ, ధర సుమారురూ. 12 వేలు (149.99 డాలర్లు) ఉంటుందని అంచనా. మోటో వాచ్ 70 కర్వ్డ్ 1.69-అంగుళాల LCD డిప్స్లే, 43mm జింక్ అల్లాయ్ కేస్, హార్ట్‌రేట్ మానిటర్ , టెంపరేచర్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి. -
194 ఎంపీ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మోటోరోలా నుంచి సూపర్ ఫ్లాగ్షిప్ మొబైల్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా సరికొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ ను లాంచ్ చేయనుంది. మోటోరోలా ఫ్రంటియర్ (Motorola Frontier) పేరుతో రానున్న ఈ మొబైల్‌కు సంబంధించిన పలు ఫీచర్స్ లీకయ్యాయి. మోటోరోలా ఫ్రంటియర్ మొబైల్ 194 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో రానునుట్లు సమాచారం. తొలుత 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని ముందుగా అంచనాలు వచ్చాయి. అలాగే 144హెట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో రానుంది. ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ వెల్లడించారు. Motorola Frontier స్పెసిఫికేషన్లు (అంచనా) 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ+ OLED డిస్ప్లే విత్ 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అప్‌గ్రేడెడ్ వెర్షన్ చిప్సెట్ LPDDR5 12జీబీ ర్యామ్ 194 ఎంపీ+50 ఎంపీ +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 60 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4500mAh బ్యాటరీ 125వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ 50 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు వైఫై 6ఈ యూఎస్బీ టైప్-సీ బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ -
మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ అంచనాలు హల్చల్
సాక్షి,న్యూఢిల్లీ: మోటరోలాకు చెందిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఫోల్డబుల్ డివైస్‌లపై భారీ క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మోటరోలా తన ఐకానిక్ మోడల్ మొబైల్‌ను మళ్లీ తీసుకొస్తోంది. అత్యుత్తమ ఫీచర్స్‌తో ఫోల్డబుల్ డిస్ప్లేతో తన పాపులర్ మోడల్ 'మోటరోలా రాజర్'ను తీసుకురాబోతోంది. మోటరోలా రాజర్ 2019 పేరుతో అదీ ఫ్లిప్ తరహాలోనే ఆ విష్కరించనుంది. లెనోవా యాజమాన్యంలోని సంస్థ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించే ఈవెంట్లో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుందని భావిస్తున్నారు. మోటరోలా మీడియా ఆహ్వానంలో ఈ సంకేతాలను అందించింది. శాంసంగ్, హువావే ఫోన్లకంటే భిన్నంగా దీన్ని తీసుకొరానుంది. ధర విషయానికి వస్తే.. యూరో 1,500 (సుమారు రూ. 1,18,500) ధర ట్యాగ్‌తో వస్తుందని అంచనా. మోటరోలా రాజర్ 2019 ఫీచర్లపై అంచనాలు 6.2 అంగుళాల డిస్ప్లే 876x2142 పిక్సెల్స్ రిజల్యూషన్ కవర్ డిస్ప్లే 600x800 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 సాక్ 6 జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ 2730 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటరోలాకు షాక్: శాంసంగ్ మరో మడత ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్దిగ్గజం శాంసంగ్‌లో మరో నూతన మడతబెట్టే ఫోన్‌ను ఆవిష్కరించనుంది. గెలాక్సీపోల్డ్ పేరుతో మడతబెట్టే ఫోనును మార్కెట్లోకి తీసుకువచ్చిన శాంసంగ్ రెండవ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. హువావే, మోటరోలా కూడా త్వరలో మడతబెట్టే ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సరికొత్త మోడల్‌ను విడదుల చేయనున్నామని శాంసంగ్ డెవలపర్స్ సదస్సులో కంపెనీ ప్రకటించింది. నూతన మోడల్ పొడవాటి డిసిప్లే నిలువుగా మడతబెట్డే విధంగా తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రధానంగా మోటరోలా ఈ నెల(నవంబరు) 13న లాంచ్ చేయనున్న ఫోల్డబుల్ ఫోన్ 'మోటరోలా రాజర్' తరహాలీ దీన్ని రూపొందించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు విడుదలచేయలేదు. దీనిని మడతబెట్టినప్పుడు చేతిలో ఒదిగిపోయేలా.. తెరిచినప్పుడు పొడవాటి డిసిప్లేతో ఆకర్షించేలా వుండనుందని అంచనా. మోడల్నెంబర్ ఎస్ఎం-ఎఫ్700ఎఫ్‌గా పిలిచే ఈ ఫోన్ 256 జీబీ అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తుంది. -
మార్కెట్లోకి మోటొరొలా స్మార్ట్ టీవీ
న్యూఢిల్లీ: మోటొరొలా కంపెనీ భారత్‌లో తొలిసారిగా స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచి్చంది. అంతే కాకుండా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మొటొరొలా ఆండ్రాయిడ్ 9.0 స్మార్ట్ టీవీ ఏడు వేరియంట్లలో లభిస్తుందని, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో ఈ నెల 29 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని మోటొరొలా మొబిలిటీ ఇండియా తెలిపింది. హెచ్డీ రెడీ, ఫుల్ హెచ్డీ, ఆల్ట్రా హెచ్డీ(4కే).. ఇలా ఏడు వేరియంట్లలో, 32 నుంచి 65 అంగుళాల సైజుల్లో లభించే ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.13,999 నుంచి ఆరంభమవుతాయని మొటొరొలా మొబిలిటీ ఇండియా హెడ్ ప్రశాంత్ మణి చెప్పారు. ఈ స్మార్ట్ టీవీతో పాటు మోటొ ఈసిక్స్‌ఎస్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని, ధర రూ.7,999 అని కంపెనీ పేర్కొ న్నారు. ఈ ఫోన్లో మీడియా టెక్ హెలియో పీ22 ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 జీబీ అడిషనల్ స్టోరేజ్, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలిపారు. -
ఆధునిక ఫీచర్లతో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్
మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. ‘వన్ విజన్’ పేరుతో ను ఈ నెల 15వ తేదీన బ్రెజిల్ సావోపోలోలో జరగనున్న ఓ ఈవెంట్లో విడుదల చేయనుంది. ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరలో సుమారు రూ.23,400 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ప్రధానంగా హోల్ పంచ్ డిస్ప్లే, 48, 5 మెగా పిక్సెల్ సామర్ధ్యం గల డబుల్ రియర్ కెమెరా లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తోంది. దీంతో పాటు మోటో ఈ6 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుందని సమాచారం. అయితే రిలీజ్‌కు ముందే వన్ విజన్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫోటోల లీకులు హల్ చల్ చేస్తున్నాయి. మోటరోలా వన్ విజన్ ఫీచర్లు 6.3 ఇంచ్ డిస్ప్లే ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 1080x2520 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+5 ఎంపీ డబుల్ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4132 ఎంఏహెచ్ బ్యాటరీ -
మోటరోలా నుంచి ‘మోటో జీ4’ స్మార్ట్ ఫోన్స్
న్యూఢిల్లీ: మోటరోలా కంపెనీ తాజాగా తన ‘మోటో జీ’ సిరీస్‌లోనే ‘మోటో జీ4’, ‘మోటో జీ4 ప్లస్’ అనే రెండు 4వ జనరేషన్ స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.13,499గా ఉంది. అలాగే ‘మోటో జీ4 ప్లస్’ రెండు వెర్షన్లలో లభ్యంకానున్నది. వీటిల్లో 5.5 అంగుళాల తెర, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2జీ/3జీ ర్యామ్, 1.5 గిగాహెర్జ్ట్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ‘మోటో జీ4’, ‘మోటో జీ4 ప్లస్’ అనే రెండు వేరియంట్ల మధ్య ఉన్న ప్రధాన తేడా.. ‘మోటో జీ4 ప్లస్’లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, 16 ఎంపీ రియర్ కెమెరా ఉంటే.. ‘మోటో జీ4’లో 13 ఎంపీ రియర్ కెమెరా ఉండి, స్కానర్ ఉండదు. ఈ ఫోన్లు కేవలం అమెజాన్‌లో మాత్రమే లభ్యంకానున్నాయి. -
మోటొరోలా ‘టర్బో’ మొబైల్
ధర రూ.41,999 న్యూఢిల్లీ: మోటొరోలా కంపెనీ తన ఫ్లాగ్షిప్ మొబైల్, మోటొ టర్బోను సోమవారం ఆవిష్కరించింది. రూ.41,999 ధర ఉండే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ను అత్యున్నత రక్షణనిచ్చే ప్రీమియం బాలిస్టిక్ నైలాన్‌తో రూపొందించామని కంపెనీ పేర్కొంది. వాటర్-రిపెల్టెంట్ కోటింగ్ రక్షణ ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్ లాలిపాప్ ఓఎస్‌పై పనిచేస్తుంది. 5.2 అంగుళాల డిస్ప్లే, 2.7 గిగా హెర్ట్స్ క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, 21 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. -
ఆన్లైన్లో మోటరోలా విక్రయాల జోరు...
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సెల్‌ఫోన్ ఇన్వెంటర్‌గా గుర్తింపు పొందిన మోటరోలా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులున్నారు. దేశంలో మొబైల్ యుగం ఆరంభంలో (1997-98) ఎవరి చేతిలో చూసినా మోటరోలా హ్యాండ్సెట్టే ఉండేదంటే అతిశయోక్తికాదు. నాణ్యతలో, ధృడత్వంలో, చక్కటి శబ్దప్రసారణలో వినియోగదారులను ఆకర్షించిన ఫోన్ ఇప్పుడు కేవలం ఆన్లైన్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లోనే లభిస్తోంది. భారత్ మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీల పోటీ కారణంగా అవుట్‌లెట్స్ ద్వారా కొద్దికాలం క్రితం అమ్మకాలు నిలిపివేసిన మోటరోలా ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ ద్వారా తిరిగి భారత్‌లోకి ప్రవేశించింది. మోటోజీ, మోటో ఈ, మోటో ఎక్స్...ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు. ఇంతవరకూ గూగుల్ చేతిలో ఉన్న మోటరోలా మొబిలిటీ సంస్థను హార్డ్‌వేర్ దిగ్గజం లెనోవా రూ. 17 వేల కోట్లతో (2.91 బిలియన్ డాలర్లు) తో తాజాగా కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మోటరోలా మొబిలిటీ సంస్థ మార్కెట్ వ్యూహాలు, కొత్త ఉత్పత్తులు, వ్యాపార లక్ష్యాల గురించి సంస్థ జనరల్ మేనేజర్ (ఇండియా) అమిత్బోని సాక్షి ప్రతినిధికి ఫోన్‌ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. మోటరోలా రీ ఎంట్రీ ఎలా వుంది? ఇండియాలో సెల్ ఫోన్ ప్రవేశపెట్టిన ఘనత మాదే. తొలి తరం సెల్వినియోగదారులకు జీవితకాలం గుర్తుండే నాణ్యమైన అనుభవాన్నిచ్చాం. అయితే కాలక్రమంలో ఎన్నో బ్రాండ్లు వచ్చినా మేం లేని లోటు ఎవరూ భర్తీ చేయలేదు. పటిష్టమైన బ్రాండ్ రీకాల్ వాల్యూ ఉండటంతో తొమ్మిది నెలల క్రితం ఇండియా మార్కెట్లో మళ్లీ ప్రవేశించాం. ఈ కామర్స్ ఊపందుకుంటున్న సమయంలో మోటరోలా సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన సెల్‌ఫోన్ వినియోగదారుడికి నచ్చిన ధరల శ్రేణిలో ఉత్పత్తులు అందించాలన్న ఉద్దేశం్యతో మోటోజీ, మోటో ఈ ఫోన్లను ప్రవేశ పెట్టాం. ఈ తొమ్మిది నెలల కాలంలో 20 లక్షల ఫోన్లు విక్రయించాం. ఫ్లిప్‌కార్ట్‌లో స్టార్ పెర్ఫార్మర్గా ఎదిగాం. మా బ్రాండ్‌కున్న పాప్యులారిటీ అది. ఆన్లైన్-ఆఫ్‌లైన్ వ్యాపారాల భవిష్యత్తుపై అంచనా? మొబైల్ఫోన్లు, క్యాజువల్స్, స్పోర్ట్గూడ్స్ లాంటి విక్రయాలకు ఆన్లైన్ ఎంతో అనువైనది. యువతరానికి సంబంధించిన వస్తువుల కొనుగోలుకు ఆన్లైన్ బెస్ట్‌ప్లేస్. ఇండియా లాంటి దేశాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగా ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ కామర్స్ మార్కెట్‌ను శాసించవచ్చు. మాకు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఆర్డర్లు వస్తున్నాయి. అయితే ఈ వ్యాపారంలో రవాణా(లాజిస్టిక్స్) కొంత అవరోధం కాగలదు. అయితే ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఈ అవరోధాన్ని దాటేశాయనిపిస్తోంది. విక్రయానంతర సేవలు ఎలా అందిస్తున్నారు? దేశ వ్యాప్తంగా 130 పట్టణాల్లో సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. తక్షణమే సేవలందించేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన మోటో ఫోన్‌కు 30 రోజుల రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం. ఏైవె నా సమస్యలుంటే...కొనుగోలు చేసిన ఉత్పత్తికి రిప్లేస్మెంట్ ఏర్పాటు చే శాం. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మా సర్వీస్ కేంద్రాలు ఎలాగూ ఉన్నాయి. వచ్చే ఏడాది మరిన్ని కేంద్రాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఆన్లైన్లో ఫ్లాష్ సేల్స్(క్షణాల్లో విక్రయించడం)పై మీ అభిప్రాయం? కొరత సృష్టించడం ద్వారా విక్రయాలు పెంచుకొనేందుకు కొన్ని సంస్థలు ఈ కామర్స్ వెబ్సైట్లలో ఫ్లాష్ సేల్స్ విధానాన్ని అవలంభించాయి. రెండు మూడు క్షణాల్లో సైట్‌ను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచి ఆ తర్వాత విక్రయాలను కొన్ని వారాల వరకు ఆపేయడం అన్న విధానానికి మేం వ్యతిరేకం. వినియోగదారుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఆన్లైన్ సేల్స్ పద్ధతి. మేం ఆ పద్ధతిలోనే వెళతాం. ఈ సీజన్లో ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు? కొత్తగా మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చాం. 2 వేరియంట్లలో 16జీబీ రూ, 31,999, రూ. 33,999 ధరకు ఫ్లిప్‌కార్టులో లభిస్తోంది. ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఇందులో మీరు కొన్ని కమాండ్స్ సెట్ చేసుకుని, ఆ కమాండ్స్ పేరుతో మీ సొంత వాయిస్‌తోనే అని పలకరించి అప్పుడు ప్రశ్నల్ని అడగటం, రిమైండర్లను సెట్ చేసుకోవడం, వంటివి చేయొచ్చు. అలాగే మీరు హ్యాండ్స్ ఫ్రీగా ఎప్పుడు ఉండాలనుకుంటున్నారో(కారు నడిపేటపుడు), సెలైంట్ మోడ్‌లో ఎప్పుడు ఉంచాలనుకుంటున్నారో(మీటింగుల్లో ఉన్నపుడు) ఈ స్మార్ట్‌ఫోన్‌కు తెలుస్తుంది. తనంతతానే ఆ మోడ్‌లోకి వెళ్తుంది. నెక్సస్ 6 సిరీస్‌ను త్వరలోనే ప్రవేశపెడుతున్నాం. ఇతర ఉత్పత్తుల్లో మోటో 360 వాచ్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం స్టాక్ పూర్తిగా అయిపోయింది.