మోటొరోలా ‘టర్బో’ మొబైల్ | Motorola launches its top end flagship Moto Turbo at Rs 41999.00 | Sakshi
Sakshi News home page

మోటొరోలా ‘టర్బో’ మొబైల్

Published Tue, Mar 10 2015 1:28 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

మోటొరోలా ‘టర్బో’ మొబైల్ - Sakshi

మోటొరోలా ‘టర్బో’ మొబైల్

ధర రూ.41,999
న్యూఢిల్లీ: మోటొరోలా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మొబైల్, మోటొ టర్బోను సోమవారం ఆవిష్కరించింది. రూ.41,999 ధర ఉండే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ను అత్యున్నత రక్షణనిచ్చే ప్రీమియం బాలిస్టిక్ నైలాన్‌తో రూపొందించామని కంపెనీ పేర్కొంది. వాటర్-రిపెల్టెంట్ కోటింగ్ రక్షణ ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్ లాలిపాప్ ఓఎస్‌పై పనిచేస్తుంది.  

5.2 అంగుళాల డిస్‌ప్లే, 2.7 గిగా హెర్ట్స్ క్వాడ్-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, 21 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement