ఆన్‌లైన్‌లో మోటరోలా విక్రయాల జోరు... | Moto 360 smart watch ran out of stock | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో మోటరోలా విక్రయాల జోరు...

Published Sat, Nov 8 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

ఆన్‌లైన్‌లో మోటరోలా విక్రయాల జోరు...

ఆన్‌లైన్‌లో మోటరోలా విక్రయాల జోరు...

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సెల్‌ఫోన్ ఇన్వెంటర్‌గా గుర్తింపు పొందిన మోటరోలా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులున్నారు. దేశంలో మొబైల్ యుగం ఆరంభంలో (1997-98) ఎవరి చేతిలో చూసినా మోటరోలా హ్యాండ్‌సెట్టే ఉండేదంటే అతిశయోక్తికాదు. నాణ్యతలో, ధృడత్వంలో, చక్కటి శబ్దప్రసారణలో వినియోగదారులను ఆకర్షించిన ఫోన్ ఇప్పుడు కేవలం ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లోనే లభిస్తోంది.

 భారత్ మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీల పోటీ కారణంగా అవుట్‌లెట్స్ ద్వారా కొద్దికాలం క్రితం అమ్మకాలు నిలిపివేసిన మోటరోలా ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెట్ ద్వారా తిరిగి భారత్‌లోకి ప్రవేశించింది. మోటోజీ, మోటో ఈ, మోటో ఎక్స్...ఇప్పుడు ఆన్‌లైన్లో హల్‌చల్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు. ఇంతవరకూ గూగుల్ చేతిలో ఉన్న మోటరోలా మొబిలిటీ సంస్థను   హార్డ్‌వేర్ దిగ్గజం లెనోవా రూ. 17 వేల కోట్లతో (2.91 బిలియన్ డాలర్లు) తో  తాజాగా కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మోటరోలా మొబిలిటీ సంస్థ మార్కెట్ వ్యూహాలు, కొత్త ఉత్పత్తులు, వ్యాపార లక్ష్యాల గురించి సంస్థ జనరల్ మేనేజర్ (ఇండియా) అమిత్‌బోని సాక్షి ప్రతినిధికి ఫోన్‌ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ వివరాలివీ..
 మోటరోలా  రీ ఎంట్రీ ఎలా వుంది?
 ఇండియాలో సెల్ ఫోన్ ప్రవేశపెట్టిన ఘనత మాదే. తొలి తరం సెల్‌వినియోగదారులకు జీవితకాలం గుర్తుండే నాణ్యమైన అనుభవాన్నిచ్చాం. అయితే కాలక్రమంలో ఎన్నో బ్రాండ్లు వచ్చినా మేం లేని లోటు ఎవరూ భర్తీ చేయలేదు. పటిష్టమైన బ్రాండ్ రీకాల్ వాల్యూ ఉండటంతో తొమ్మిది నెలల క్రితం ఇండియా మార్కెట్లో మళ్లీ ప్రవేశించాం.

ఈ కామర్స్ ఊపందుకుంటున్న సమయంలో మోటరోలా సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన సెల్‌ఫోన్ వినియోగదారుడికి నచ్చిన ధరల శ్రేణిలో ఉత్పత్తులు అందించాలన్న ఉద్దేశం్యతో మోటోజీ, మోటో ఈ ఫోన్లను ప్రవేశ పెట్టాం. ఈ తొమ్మిది నెలల కాలంలో 20 లక్షల ఫోన్లు విక్రయించాం. ఫ్లిప్‌కార్ట్‌లో స్టార్ పెర్‌ఫార్మర్‌గా ఎదిగాం. మా బ్రాండ్‌కున్న పాప్యులారిటీ అది.

 ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ వ్యాపారాల భవిష్యత్తుపై  అంచనా?
 మొబైల్‌ఫోన్లు, క్యాజువల్స్, స్పోర్ట్‌గూడ్స్ లాంటి విక్రయాలకు ఆన్‌లైన్ ఎంతో అనువైనది. యువతరానికి సంబంధించిన వస్తువుల కొనుగోలుకు ఆన్‌లైన్ బెస్ట్‌ప్లేస్. ఇండియా లాంటి దేశాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగా ఉండటంతో రాబోయే రోజుల్లో  ఈ కామర్స్ మార్కెట్‌ను శాసించవచ్చు. మాకు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఆర్డర్లు వస్తున్నాయి. అయితే ఈ వ్యాపారంలో రవాణా(లాజిస్టిక్స్) కొంత అవరోధం కాగలదు. అయితే ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఈ అవరోధాన్ని దాటేశాయనిపిస్తోంది.

 విక్రయానంతర సేవలు ఎలా అందిస్తున్నారు?
 దేశ వ్యాప్తంగా 130 పట్టణాల్లో సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. తక్షణమే సేవలందించేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన మోటో ఫోన్‌కు 30 రోజుల రిప్లేస్‌మెంట్ వారంటీ ఇస్తున్నాం. ఏైవె నా సమస్యలుంటే...కొనుగోలు చేసిన ఉత్పత్తికి రిప్లేస్‌మెంట్ ఏర్పాటు చే శాం. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మా సర్వీస్ కేంద్రాలు ఎలాగూ ఉన్నాయి. వచ్చే ఏడాది మరిన్ని కేంద్రాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం.

 ఆన్‌లైన్లో ఫ్లాష్ సేల్స్(క్షణాల్లో విక్రయించడం)పై  మీ అభిప్రాయం?
 కొరత సృష్టించడం ద్వారా విక్రయాలు పెంచుకొనేందుకు కొన్ని సంస్థలు ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఫ్లాష్ సేల్స్ విధానాన్ని అవలంభించాయి. రెండు మూడు క్షణాల్లో సైట్‌ను కొనుగోలుదారులకు  అందుబాటులో ఉంచి ఆ తర్వాత విక్రయాలను  కొన్ని వారాల వరకు ఆపేయడం అన్న విధానానికి మేం వ్యతిరేకం. వినియోగదారుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఆన్‌లైన్ సేల్స్ పద్ధతి. మేం ఆ పద్ధతిలోనే వెళతాం.

 ఈ సీజన్‌లో ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు?
 కొత్తగా మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చాం. 2 వేరియంట్లలో 16జీబీ రూ, 31,999, రూ. 33,999 ధరకు ఫ్లిప్‌కార్టులో లభిస్తోంది. ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఇందులో మీరు కొన్ని కమాండ్స్ సెట్ చేసుకుని, ఆ కమాండ్స్ పేరుతో మీ సొంత వాయిస్‌తోనే అని పలకరించి అప్పుడు ప్రశ్నల్ని అడగటం, రిమైండర్లను సెట్ చేసుకోవడం, వంటివి చేయొచ్చు.

అలాగే మీరు హ్యాండ్స్ ఫ్రీగా  ఎప్పుడు ఉండాలనుకుంటున్నారో(కారు నడిపేటపుడు), సెలైంట్ మోడ్‌లో ఎప్పుడు ఉంచాలనుకుంటున్నారో(మీటింగుల్లో ఉన్నపుడు) ఈ స్మార్ట్‌ఫోన్‌కు తెలుస్తుంది. తనంతతానే ఆ మోడ్‌లోకి వెళ్తుంది. నెక్సస్ 6 సిరీస్‌ను త్వరలోనే ప్రవేశపెడుతున్నాం. ఇతర ఉత్పత్తుల్లో మోటో 360 వాచ్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం స్టాక్ పూర్తిగా అయిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement