అద్భుత ఫీచర్లతో తొలి రెడ్‌మి స్మార్ట్‌టీవీ | Redmi TV with 70 inch display to launch on August 29  | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో తొలి రెడ్‌మి స్మార్ట్‌టీవీ

Published Mon, Aug 19 2019 2:44 PM | Last Updated on Mon, Aug 19 2019 8:38 PM

Redmi TV with 70 inch display to launch on August 29  - Sakshi

బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి అనుబంధ సంస్థ రెడ్‌మి ఇకపై స్మార్ట్‌టీవీలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు  షావోమి వ్యవస్థాపకుడు, ఛైర్మన్  సీఈవో లీ జున్ ధృవీకరించారని  చైనా న్యూస్‌పోర్టల్‌  సోమవారం తెలిపింది.

70 అంగుళాల భారీ స్క్రీన్‌తో మొట్టమొదటి రెడ్‌మి టీవీని ఆగస్టు 29న చైనాలో ప్రారంభించనుంది. రెడ్‌మి టీవీ (మోడల్ నంబర్ ఎల్70ఎం 5) ఇటీవల చైనాలో తన 3 సి సర్టిఫికేషన్‌ ఆమోదించింది. ఆండ్రాయిడ్ టీవీ  ఓఎస్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను నడుపుతుంది.  ఫీచర్లువిషయానికి వస్తే  4కే టీవీలో హెచ్‌డిఆర్ సపోర్ట్, డాల్బీ , డిటిఎస్ ఆడియో,  బ్లూటూత్ వాయిస్ రిమోట్‌ తదితర ఫీచర్లు జోడించింది.  ఈ స్మార్ట్‌టీవీ లాంచింగ్‌తోపాటు,  8వ జనరేషన్‌కు చెందిన రెడ్‌మి నోట్ 8, రెడ్‌మి 8, రెడ్‌మి 8 ఎ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement