
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్ లైవ్‌లో ఉంది. ఈ సేల్ మార్చి 14తో ముగియనుంది.
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ భాగంగా వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక స్మార్ట్‌టీవీలపై ఏకంగా 55 శాతం మేర తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ఇక మొబైల్ యాక్సెసరీస్‌పై 70 శాతం మేర, వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌పై 60 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఇక ప్రైమ్ మెంబర్స్‌కు ఏకంగా రూ.20 వేల వరకు బెనిఫిట్స్ రానున్నాయి.
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్: స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ ఆఫర్స్
► OnePlus 9R(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 15 శాతం తగ్గింపుతో రూ.33,999కు రానుంది. OnePlus 9 Pro(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 12 శాతం తగ్గింపుతో రూ. 56,999 కోనుగోలుచేయవచ్చును.
► OnePlus 9(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 14 శాతం తగ్గింపుతో రూ.42,999. అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి తగ్గింపు లేనప్పటికీ, స్మార్ట్‌ఫోన్స్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 16,550 రానుంది. దీంతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 26,449కే కోనుగోలు చేయవచ్చును.
► Realme Narzo 50A (4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ రూ. 1500 తగ్గింపుతో రూ.11,499కు రానుంది.
► Samsung Galaxy M52 5G 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్‌పై రూ. 10 వేల తగ్గింపుతో 24,999కు రానుంది.
► Redmi 9A Sport స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 తగ్గింపుతో రూ. 6,999కు రానుంది. Redmi Note 11 స్మార్ట్‌ఫోన్‌పై 25శాతం తగ్గింపుతో రూ. 13,499కు రానుంది.
► Tecno Spark 8 Pro స్మార్ట్‌ఫోన్‌పై రూ.3500 తగ్గింపుతో రూ. 9999కు రానుంది. Tecno Camon 17 స్మార్ట్‌ఫోన్‌పై రూ . 2,000 తగ్గింపుతో రూ. 13,999కు అందుబాటులో ఉంది .
అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్: టీవీ మోడళ్లపై బెస్ట్ ఆఫర్స్
► OnePlus (32-అంగుళాల) Y-సిరీస్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీను రూ.15,999.కి కొనుగోలు చేయవచ్చు.
► Redmi TV (32-అంగుళాల నుంచి 55-అంగుళాల) స్మార్ట్‌టీవీలు తగ్గింపు ధరలలో రానున్నాయి.
► Samsung 43-అంగుళాల క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా HD స్మార్ట్ LED TV రూ. 36,990 లభించనుంది.
చదవండి: అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..!