
ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడంతో స్మార్ట్‌టీవీ మార్కెట్ జోరుమీదుంది. తాజాగా ఈ మార్కెట్‌లో వాటా దక్కించుకునేందుకు దావా కంపెనీ రంగంలోకి దిగింది. మార్కెట్‌లో అప్ టూ డేట్ ఫీచర్లతో తక్కువ ధరలో రెండు స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి తెచ్చింది.
- 43 ఇంచుల ఆల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ ధర రూ.34,999లు ఉండగా 55 ఇంచుల ఆల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీ ధర రూ. 49,999లుగా ఉంది. ఈ రెండు టీవీలు వెబ్ ఓస్ ఆధారంగా పని చేస్తాయి. ఈ టీవీలలో క్వాడ్‌కోర్ ప్రాసెసర్లను ఉపయోగించారు. 1.5 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజీని కలిగి ఉన్నాయి.
- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ప్రైమ్‌వీడియో, హాట్‌స్టార్ వంటి పాపులర్ ఓటీటీ యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. థింక్‌క్యూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని ఇందులో అమర్చడం వల్ల వాయిస్ కమాండ్ కంట్రోల్, మ్యాజిక్ రిమోట్, అలెక్సా వంటి ఫీచర్లు కలిగి ఉంది. మొత్తంగా హ్యాండ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దైవా కంపెనీకి దేశవ్యాప్తంగా 800లకు పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment