
చైనాకు చెందిన టీసీఎల్ మల్టీమీడియా తాజాగా భారత మార్కెట్లోకి ఐఫాల్కన్ బ్రాండ్ కింద స్మార్ట్ టీవీలు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 2 లక్షల టీవీలు విక్రయించాలని నిర్దేశించుకుంది. అమ్మకాల కోసం ప్రధానంగా ఆన్‌లైన్ వ్యూహాన్నే అనుసరించనున్నట్లు ఫాల్కన్ టెక్నాలజీ గ్లోబల్ సీఈవో టోనీ గో తెలిపారు.
ఇందులో భాగంగా ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా విక్రయ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం టీవీలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నామని, అమ్మకాలను బట్టి ఏడాది తర్వాత స్థానికంగా కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయని టోనీ వివరించారు. ప్రస్తుతం షావోమి, వ్యు, థామ్సన్ తదితర సంస్థలు చౌకగా స్మార్ట్ టీవీలను విక్రయిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment