సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి భారత్‌లో తొలిసారిగా ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4 విక్రయాలను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్లతో ప్రధాన ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించిన షావోమీ ఇపుడిక టీవీ రంగంలో కూడా ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమై పోయింది. ఈ నేపథ్యంలో అద్భుత ఫీచర్లతో లాంచ్ చేసిన ఎంఐ స్మార్ట్ టీవీని ఈ మధ్యాహ్నం 2 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ద్వారా విక్రయానికి అందుబాటులోకి తేనుంది. ‘ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4’ పేరుతో ప్రపంచంలోనే అతి పలుచనైన టీవీని ఇటీవల మార్కెట్‌లో ఆవిష్కరించింది. చైనా వెలుపల భారత్‌లోనే తొలిసారిగా టీవీలను విక్రయిస్తోంది. దీని ధర రూ.39,999 గా కంపెనీ నిర్ణయించింది. శాంసంగ్, సోనీ, ఎల్‌జీ లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థల టీవీలకు గట్టిపోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాల అంచనా.
ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4 ఫీచర్లు
4.9 ఎంఎం అల్ట్రా–థిన్ ఫ్రేమ్‌లెస్ డిజైన్
55 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్
4కే రెజల్యూషన్ (3840x2160 పిక్సెల్స్)
హెచ్‌డీఆర్ సపోర్ట్, 64 బిట్ 1.8 గిగాహెర్జ్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ
ఇక లాంచింగ్ విషయానికి వస్తే....ఎంఐ టీవీ కొనుగోలుదారులకు రూ.619 విలువ చేసే సోనీ లివ్, హంగామా ప్లే 3 నెలల చందా ఉచితం. అలాగే ఎంఐ ఐఆర్ కేబుల్ (రూ. 299) ఫ్రీ. దీంతోపాటు రూ.1,099 విలువ చేసే ఆన్సైట్ ఇన్‌ష్టలేషన్ ఉచితం. అంతేకాదు స్మార్ట్ టీవీతో కలిపి 11-బటన్ మిని రిమోట్‌ను అందిస్తోంది. దీంతో అటు టీవీని, ఇటు సెట్-టాప్ బాక్సును నియంత్రించవచ్చు.
ఇక కనెక్టివిటీ పరంగా, మూడు హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్స్, రెండు యూఎస్‌బీ పోర్ట్స్, డ్యూయెల్ బాండ్ వై–ఫై, బ్లూటూత్ 4.0, డాల్బే+డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, ప్యాచ్‌వాల్ ఓఎస్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ వంటి పలు ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌టీవీ సొంతం. ముఖ‍్యంగా 15 భాషల్లో 5,00,000లకుపైగా గంటల (వీటిలో 80 శాతం ఉచితం) అందించేందుకు వీలుగా హంగామా, ఏఎల్‌టీ బాలాజీ, జీ5, సోనీ లిప్ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని షావోమి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Mi fans! For the first time ever, #MiTV4 goes on sale today at 2PM on https://t.co/D3b3Qt4Ujl & @Flipkart. Are you ready for the visual treat? pic.twitter.com/zXSmbTR1kd
— Mi India (@XiaomiIndia) February 22, 2018
Mi fans! Greet the world's thinnest LED TV - #MiTV4
— Mi India (@XiaomiIndia) February 16, 2018
- 4.9mm Ultra-thin
- 4K HDR 10 Frameless display
First sale on Feb 22 on https://t.co/D3b3QtmvaT, @Flipkart and Mi Home. RT if you ❤️ the Mi TV 4. pic.twitter.com/1eRg7pOrmO
Comments
Please login to add a commentAdd a comment