
దసరా, దీపావళి పండుగ సీజన్లు రావడంతో పలు ఈ-కామర్స్ సంస్థలు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఉత్పత్తుల సంస్థలు ఫెస్టివల్ సీజన్లను ప్రకటించాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ-కామర్స్ సంస్థల బాటలోనే ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ కూడా నడుస్తోంది. షావోమీ కొనుగోలు దారులకు ‘దీపావళి సేల్ విత్ ఎమ్‌ఐ’ సేల్ ను ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌తో పాటుగా షావోమీ సేల్‌పై భారతీయులు ఎగబడి స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేశారు. 5 రోజుల్లో అక్షరాల 20 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని షావోమీ బుధవారం రోజున ఒక ప్రకటనలో వెల్లడించింది.
చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..!
ప్రీమియం సెగ్మెంట్‌లో భాగంగా షావోమీ 11 లైట్ ఎన్‌ఈ5జీ, మిడియమ్ సెగ్మెంట్‌లో ఎమ్ 11ఎక్స్, రెడ్‌మీ నోట్ 10ఎస్, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ భారతీయులు భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో 10 శాతం మేర అమ్మకాలు జరిగాయని షావోమీ పేర్కొంది. ఇక స్మార్ట్‌టీవీ అమ్మకాల్లో కూడా షావోమీ రికార్డు నమోదు చేసింది. మూడురోజల్లో సుమారు లక్షకు పైగా స్మార్ట్‌టీవీలను షావోమీ విక్రయించింది.
చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment