
Karbonn Launches Made In India Smart LED TVs In India: ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం కార్భన్ మొబైల్స్ స్మార్ట్‌టీవీ ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెట్టింది. అందులో భాగంగా భారత మార్కెట్లలోకి మూడు స్మార్ట్‌టీవీ మోడళ్లను కార్భన్ లాంచ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా చొరవతో కంపెనీ స్మార్ట్‌టీవీలను తయారుచేసింది. కంపెనీ తన ఆఫ్‌లైన్ పరిధిని విస్తరించడానికి రిలయన్స్ డిజిటల్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ స్మార్ట్‌టీవీలను రిలయన్స్ డిజిటల్‌లో కొనుగోలు చేయవచ్చును.
చదవండి: గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్..!
కార్బన్ స్మార్ట్‌టీవీ భాగంగా 32, 39, 24 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు క్వాలిటీ డిజైన్, ఇన్-బిల్ట్ యాప్ స్టోర్‌తో రానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌తో ఈ టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చును. స్మార్ట్‌టీవీ పోర్ట్‌ఫోలియోలో భాగంగా రాబోయే 2 సంవత్సరాలలో 15 మోడళ్లకు విస్తరించాలని కార్బన్ లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ స్మార్ట్‌టీవీల ధరలు రూ. 7990 నుంచి ప్రారంభమవ్వనున్నాయి.
కార్బన్ స్మార్ట్‌టీవీ ఫీచర్స్..!
- బెజెల్‌లేస్ డిజైన్
- హెచ్‌డీ డిస్‌ప్లే
- క్వాడ్‌కోర్ ఏ53 1.5GHz ప్రాసెసర్
- మాలి-G31 (డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్)
- ఆండ్రాయిడ్ 9 సపోర్ట్
- 1జీబీ ర్యామ్+8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- యూఎస్‌బీ సపోర్ట్
- వీజీఏ, హెచ్‌డీఎమ్‌ఐ సపోర్ట్
- మూవీ బాక్స్, స్మార్ట్‌టీవీ రిమోట్
- ఇన్ బిల్ట్ యాప్స్ స్టోర్
- 20వాట్ స్పీకర్స్
- వైఫై, ఈథర్‌నెట్ సపోర్ట్
చదవండి: మిలిటరీ-గ్రేడ్ రేంజ్‌లో నోకియా స్మార్ట్‌ఫోన్..! కొనుగోలుపై ఇయర్‌బడ్స్ ఉచితం..!
Comments
Please login to add a commentAdd a comment