
బీజింగ్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మి అద్భుత ఫీచర్లతో స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 70 అంగుళాల భారీ స్క్రీన్‌తో మొట్టమొదటి రెడ్‌మి టీవీని నేడు (గురువారం, ఆగస్టు 29) బీజింగ్‌లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను నడుపుతుంది. అద్భుత ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే దీన్ని లాంచ్ చేసింది.
4కే టీవీ ఫీచర్ల విషయానికి వస్తే...అల్ట్రా థిన్ బెజెల్స్, క్వాడ్ కోర్ సాక్, హెచ్‌డిఆర్ సపోర్ట్, 2జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్, డాల్బీ, డీటీఎస్ ఆడియో, 4.2 బ్లూటూత్, వాయిస్ రిమోట్ తదితర ఫీచర్లు జోడించింది. వీటితోపాటు రెడ్‌మి నోట్ 8 సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 8, 8ప్రొ స్మార్ట్‌ఫోన్లు, రెడ్‌మి బుక్14ను కూడా ఈ రోజే లాంచ్ చేసింది. చైనా మార్కెట్లో ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇండియా సహా, గ్లోబల్ మార్కెట్లలో వీటి లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
సుమారు ధర రూ. 38,000
Comments
Please login to add a commentAdd a comment