సాక్షి, ముంబై: తమ అభిమాన బ్రాండ్ షావోమి స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవాలనుకున్న కస‍్టమర్లను అవుట్ ఆఫ్ స్టాక్ నోటిపికేషన్ వెక్కిరించింది. విక్రయాలు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఎంఐ ఎల్‌ఈడీ టీవీలు చేజారిపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు ఎంఐ 32, 43, 55 అంగుళాల స్మార్ట్ టీవీల సేల్స్ గ్రాండ్ ఓపెనింగ్.. బిగ్ సేల్స్ అంటూ కంపెనీ వెల్లడించింది. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర కేవలం రూ.13, 999గా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.22 999గాను, 55 అంగుళాల టీవీని రూ .39,999గాను నిర్ణయించింది. అయితే సేల్ ప్రారంభించిన నిమిషాల్లోనే వినియోగదారులను ఉసూరుమనిపించింది. ఒక విధంగా కళ్లు మూసి తెరిచేలోపు అవుట్ ఆఫ్ స్టాక్...నోటి ఫై మి అని దర్శనమివ్వడంపై కస్టమర్లు తీవ్ర అసహనం వ‍్యక్తం చేశారు తదుపరి విక్రయాలు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని షావోమి ప్రకటించింది.
కాగా స్మార్ట్‌ఫోన్ సంచలనం షావోమి టీవీ సెగ్మెంట్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, సరసమైన ధర అంటూ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గతనెలలో ప్రారంభించిన కొత్త టీవీ సిరీస్ ఎంఐ స్మార్ట్‌టీవీ 4ఏ ల తొలి విక్రయంలో ఫ్లిప్‌కార్ట్, తన అధికారిక వెబ్‌సైట్లో భారత వినియోగదారులకు నేడు (మంగళవారం) అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ఇటీవల లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 5, నోట్ 5 ప్రో సేల్స్‌ను కూడా ఈ రోజు మరోసారి ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుండటం గమనార్హం. దీనిపై షావోమి అభిమానుల ఆగ్రహం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment