శామ్‌సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ | Samsung Announces BIG TV offers on Large Screen TVs | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ 

Published Thu, Jan 7 2021 7:30 PM | Last Updated on Thu, Jan 7 2021 8:59 PM

Samsung Announces BIG TV offers on Large Screen TVs - Sakshi

శామ్‌సంగ్ ఇండియా మరో కొత్త సేల్ ను "బిగ్ టీవీ డేస్ సేల్" పేరుతో ముందుకు తీసుకొచ్చింది. ఈ సేల్ లో కేవలం స్మార్ట్ టీవీలు మాత్రమే లభించనున్నాయి. కానీ ఈ సేల్ లో మీరు కొన్న ప్రతి స్మార్ట్ టీవీతో పాటు మొబైల్ ఫోన్స్, సౌండ్‌బార్లు ఉచితంగా లభించనున్నాయి. 55 అంగుళాల టీవీ నుంచి ప్రీమియం టీవీల వరకు అన్ని స్మార్ట్ టీవీలపైన ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్ 2021 జనవరి 1 నుంచి 31 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శామ్‌సంగ్ రిటైలర్ స్టోర్లలో ఈ సేల్ నడుస్తుంది. అలాగే వినియోగదారులు 20 శాతం క్యాష్‌బ్యాక్ కూడా సేల్లో పొందవచ్చు. రూ.1,990 ఈఎంఐకే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు.(చదవండి: శామ్‌సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్‌ మొబైల్)

65-అంగుళాల క్యూఎల్‌ఇడి టివి, 75 అంగుళాల క్రిస్టల్ 4కే యుహెచ్‌డి టివిలను కొనుగోలు చేసే వినియోగదారులకు శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 51 ఉచితంగా లభిస్తుంది. 55 అంగుళాల క్యూఎల్‌ఇడి టీవీ, 65 అంగుళాల క్రిస్టల్ 4కె యుహెచ్‌డి టివిలను ఎంచుకునే కొనుగోలుదారులకు శామ్‌సంగ్ గెలాక్సీ ఎ31 స్మార్ట్‌ఫోన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే 75-అంగుళాల, 82-అంగుళాల, 85-అంగుళాల క్యూఎల్‌ఇడి టీవీలను కొనుగోలు చేసే వ్యక్తులు సౌండ్‌బార్ HW-Q800T లేదా HW-Q900T ఉచితంగా పొందుతారు. శామ్‌సంగ్ క్యూఎల్‌ఇడి టివిలకు 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ, ఒక ఏడాది కాంప్రహెన్సీవ్ వారెంటీ, ప్యానెల్‌పై ఒక ఏడాది అడిషనల్ వారెంటీ లభిస్తుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement