అద్భుతమైన నోకియా టీవీ ఆవిష్కరణ | Nokia first smart TV launched in India | Sakshi
Sakshi News home page

అద్భుతమైన నోకియా టీవీ ఆవిష్కరణ

Published Thu, Dec 5 2019 3:06 PM | Last Updated on Thu, Dec 5 2019 3:22 PM

Nokia first smart TV launched in India - Sakshi

సాక్షి, ముంబై:ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తన మొట్ట మొదటి స్మార్ట్ టీవీని లాంచ్‌ చేసింది.  ప్రస్తుత ట్రెండ్‌కనుగుణంగా అద్భుతమైన ఫీచర్లు, అంతకుమించిన ఆడియో  క్వాలిటీతో తన స్మార్ట్‌ టీవీను అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా తన ప్రత్యర్థి కంపెనీలు వన్ ప్లస్, షావోమి,మోటొరోలా వంటి సంస్థలకు దడ పుట్టిస్తోంది.  

నోకియా టీవీ ఫీచర్లు
55 అంగుళాల అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్  9
సీఏ53 క్వాడ్ కోర్ ప్రాసెసర్
2.25 జీబీ  ర్యామ్‌, స్టోరేజ్ సామర్థ్యం 16 జీబీ
​వైఫై యాక్సెస్‌
3 హెచ్ డీఎంఐ పోర్టులు,
రెండు యూఎస్ బీ పోర్టులు

ఆకట్టుకునే  డిజైన్‌, స్టయిలిష్‌ లుక్‌, స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ, అద్భుతమైన ఆడియో   వీటి ప్రత్యేకం.  నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, ఇతర గూగుల్ సూట్ యాప్స్‌ను కూడా ఈ నోకియా టీవీ సపోర్ట్ చేస్తుంది. వీటిని ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టీవీ అనుభవాన్ని పూర్తిస్థాయిలో  అందించేందుకు  తొలిసారిగా జేబీఎల్ తో జత కలిసినట్టు నోకియా ఇప్పటికే ప్రకటించింది. తద్వారా  ఈ టీవీలో డాల్బీ ఆడియోతో పాటు, డీటీఎస్ ట్రూసరౌండ్ ఫీచర్‌ ద్వారా 5.1 చానెల్ సౌండ్ అనుభూతినిస్తుందని కంపెనీ తెలిపింది.

ధర
55 అంగుళాల  4కే యూహెచ్‌డీ స్మార్ట్ టీవీ ధర రూ.41,999
ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా డిసెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి లభ్యం కానుంది. అన్ని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.2 వేల వరకు తగ్గింపు. ఈ టీవీతో పాటు కంప్లీట్ ప్రొటెక్షన్  ప్లాన్‌ను కూడా కొనుగోలు చేస్తే రెండు సంవత్సరాలు అదనపు వారంటీ అందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement