
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న షావోమి, ప్రస్తుతం టీవీ మార్కెట్లోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే తేలికైన, సన్నని టీవీని లాంచ్ చేసిన షావోమి, మరో స్మార్ట్‌టీవీని తీసుకొచ్చింది. ఎంఐ టీవీ 4ఎస్ పేరుతో ఈ స్మార్ట్‌టీవీని తన సొంత మార్కెట్ చైనాలో లాంచ్ చేసింది. హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, ప్యాచ్‌వాల్, డాల్బీ ఆడియో, ఇతర ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి.
ఎంఐ టీవీ 4ఎస్ స్పెషిఫికేషన్లు...
55 అంగుళాల 4కే డిస్‌ప్లే
64 బిట్ క్వాడ్ కోర్ అమ్‌లోజికల్ కార్టెక్స్-ఏ53 ప్రాసెసర్
2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
రెండు 8డబ్ల్యూ స్పీకర్లు విత్ డాల్బీ
వాయిస్ కంట్రోల్ సపోర్ట్
ఆండ్రాయిడ్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూఐ
ధర 2,999 సీఎన్‌వై (సుమారు రూ.31,100)
అయితే ఈ టీవీని షావోమి భారత్ వంటి ఇతర మార్కెట్లలో లాంచ్ చేస్తుందో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎంఐ టీవీ 4, ఎంఐ టీవీ 4ఏలు విక్రయానికి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment