ఇటీవల ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్‌ఫోన్లు పేలిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల కారణంగా కొందరు తీవ్రంగా గాయపడగా, ఇంకొందరి ప్రాణాలు కూడా పోయాయి. తాజాగా గజియాబాద్‌లో టీవీ పేలి ఓ టీనేజర్ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాల వాడడంపై కాకుండా సురక్షితం ఎలా వాడాలో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టీవీలు పేలడం అరుదుగా జరిగే ఘటనలే అయినప్పటికీ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని గజియాబాద్ సంఘటన చెప్తోంది. ఈ నేపథ్యంలో వీటి పేలుడుకి ప్రధాన కారణాలను పరిశీలిస్తే..
గజియాబాద్ ఘటనలో టీవి పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇంటి గోడ
ఎల్‌ఈడీ టీవీలు పేలడానికి గల కారణాలు ఇవే!
ఎల్ఈడీ టీవీలు పేలడానికి రకరకాల కారణాలున్నాయి. టీవీలో ఉండే కెపాసిటర్లు వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే కెపాసిటర్ అంటే విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుని.. బ్యాటరీలా పని చేస్తుంది. టీవీ ఆపరేట్ చేయడానికి, అవసరమైన సమయంలో స్టాండ్‌బై మోడ్‌లో ఉండటానికి అవసరమైన కొద్దిపాటి శక్తిని నిల్వ చేస్తుంది. అయితే క్వాలిటీ కెపాసిటర్ వాడడం వల్ల, లేదా టీవీలోని కెపాసిటర్‌లు పాతవి కావడం వల్లే పేలుళ్లు సంభవిస్తాయి. అయితే గజియాబాద్ పేలుడు ఇంత తీవ్రస్థాయిలో ఉండడానికి గది వాతావరణం కూడా కారణమై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఓవర్ హీటింగ్
ఎలక్ట్రికల్ డివైజ్‌లు చాలా వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు లేదా పేలుడుకు గురవుతాయి. టీవీలను ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు లేదా చాలా పరికరాలను టీవీలకు కనెక్ట్ చేసి వాడుతున్న సమయంలో అవి సులభంగా వేడెక్కుతుంది. ఈ క్రమంలో వేడెక్కిన పరికారాలు వాటి పరిమితి దాటిన వెంటనే పేలుడికి దారితీస్తాయి.
అకస్మాత్తుగా వోల్టేజ్‌లో మార్పు..
భారత్ వంటి దేశాలలో టీవీ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణాలలో ఒకటి విద్యుత్ లేదా వోల్టేజ్‌లో ఆకస్మిక పెరుగుదల కూడా ఒకటి. దీనినే మరో రకంగా పవర్ సర్జ్ అని కూడా అంటాం. తప్పుడు వైరింగ్ ఉన్న ప్రాంతాల్లో ఇది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆకస్మిక విద్యుత్ పెరుగుదల నుంచి డివైజ్ డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంచేందుకు కంపెనీలు టీవీలో అనేక పరికారలను ఏర్పాటు చేస్తాయి. తద్వారా ఆది ఆకస్మిక వోల్టేజ్ పెరుగుదలను తట్టుకోగలదు, అయినప్పటికీ, అవి కూడా కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అందుకే ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాల సమయంలో టీవీలను ఆఫ్ చేయమని చెబుతుంటారు.
చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి!
Comments
Please login to add a commentAdd a comment