
సాక్షి, ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కర్మాగారంలో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఘజియాబాద్‌లోని మోదీ నగర్‌లో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అజయ్ శంకర్ పాండే తెలిపారు. మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment