
'ఆర్ఆర్ఆర్' సినిమా 2022 మార్చిలో థియేటర్లలో రిలీజైంది.

పాన్ ఇండియా లెవల్లో హిట్ కావడంతో పాటు రూ.1000 కోట్లకు పైనే కలెక్షన్ సాధించింది.

ఇదే సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆ తర్వాత ఆస్కార్ కూడా వచ్చింది.

అయితే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో డాక్యుమెంటరీ తీశారు.

దీన్ని ఈనెల 20న కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఇందులో చరణ్, తారక్ చెప్పిన సంగతులు బాగానే ఉన్నాయి.

ఇది చూస్తుంటే మేకింగ్ వీడియోలా ఉంది. ఇది థియేటర్లలో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి?

















