behind
-
తెర వెనక 'ఆర్ఆర్ఆర్' ఇన్నాళ్లకు.. అటు తారక్ ఇటు చరణ్! (ఫొటోలు)
-
వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. వేసవిలో శునకాలు రెచ్చిపోతుండటాన్ని మనం చూస్తుంటాం. అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.మనుషులకు మాదిరిగానే చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం మొదలైనవి కుక్కల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం కుక్కలు చల్లని వాతావరణంలో ఉదాశీనంగా ఉంటాయి. అయితే వేసవికాలం రాగానే అవి హైపర్ యాక్టివ్‌గా మారిపోతాయి. వేసవిలో కుక్కలు మరింత దూకుడుగా మారుతాయని ఒక పరిశోధనలో వెల్లడయ్యింది.అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోస్ ఆర్చ్ తెలిపిన వివరాల ప్రకారం వేసవి కాలంలో శునకాలు మరింత వేడి అనుభూతికి లోనవుతాయి. వేసవికాలం మనుషులకు మించి శునకాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అధిక వేడి లేదా ఉష్ణోగ్రత శునకాలలోని థర్మోగ్రూలేషన్ను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కుక్కలు వేడిని తట్టుకోలేవు. ఇటువంటి పరిస్థితిలో కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి.వేసవి కాలంలో కుక్కలలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుతుందని పెన్ స్టేట్ యూనివర్శిటీ ఒక పరిశోధనలో కనుగొంది. దీని కారణంగా అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని గుర్తించారు. ఈ సమయంలో కుక్కలు ఆకస్మికంగా మొరగడం, మనుషులను చుట్టుముట్టడం, కరవడం, పరిగెత్తడం లాంటి చర్యలను చేస్తాయి.వేసవిలో పెంపుడు శునకాలు లేదా వీధి కుక్కలు ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవి ఎప్పుడూ నీరసంగా పడుకున్నట్లు కనిపిస్తే, అవి వడ దెబ్బకు గురయ్యాయని గుర్తించాలి. అటువంటి స్థితిలో వాటికి వైద్య సహాయం అందించాలి. -
పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం?
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమైన అనంతరం పాకిస్తాన్‌లోనూ అదే తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మౌలానా జియావుర్ రెహ్మాన్ అనే మతపెద్ద కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్లోని ఒక పార్కులో పట్టపగలు హత్యకు గురయ్యాడు. రెహ్మాన్ లష్కరే కార్యకర్త. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు రెహమాన్‌ను కాల్చిచంపారు. రెహ్మాన్ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఈ హత్య జరిగింది. ఈ హత్య అతని బంధువులు, స్నేహితులు, అనుచరులను ఆందోళనకు గురిచేసింది. పాకిస్తాన్లో మతపెద్దలు.. మతపరమైన కార్యక్రమాలతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ హత్య తీరులోనే లష్కర్ కార్యకర్త రెహ్మాన్ హత్య జరిగింది. ఉగ్రవాద ఆరోపణలతో భారత్ మోస్ట్ వాటెండ్‌గా ప్రకటించిన పంజ్వార్ను గత మే నెలలో లాహోర్‌లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. BIG BREAKING NEWS - Maulana Tariq Jameel's son Asim Jameel shot dead by UNKNOWN MEN in Talamba, Mian Chunnu of Pakistan 🔥🔥 Radical Maulana Tariq Jameel is well known for his hate speeches against Hindus and Bharat. All Terrorists in fear, ISI shocked after back to back such… pic.twitter.com/xRQ2hrhZUn — Times Algebra (@TimesAlgebraIND) October 29, 2023 పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, టెర్రర్ బాస్‌లు ఈ రెండు హత్యల్లోనూ సారూప్యతలను గమనించారు. ఈ నేపధ్యంలో ఐఎస్ఐ దాదాపు డజను ‘ఆస్తులను’.. ‘సేఫ్ హౌస్’లో ఉంచినట్లు ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్న నిఘా వర్గాలు తెలిపాయి. రావల్కోట్లో అబూ ఖాసిమ్ కాశ్మీరీ, నజీమాబాద్‌లో ఖరీ ఖుర్రామ్ షాజాద్ అనే మరో ఇద్దరు ఎల్ఈటీ కార్యకర్తల హత్యల కారణంగా బహుశా ముందుజాగ్రత్త మరింత అవసరమని ఐఎస్ఐ భావించి ఉండవచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే హత్యకు గురైన రెహ్మాన్.. జామియా అబూ బకర్ అనే మదర్సాలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. పాకిస్తాన్ పోలీసులు తమ ప్రెస్ నోట్లో ఈ హత్యను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. దేశంలో ఉగ్రవాదుల పాత్రను ఇది సూచిస్తోందని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ పోలీసులు దీనిని టార్గెట్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. రెహ్మాన్ హత్య కరాచీలో మత బోధకులపై వరుస దాడుల్లో భాగమని భావిస్తున్నారు. ఈ బోధకులంతా ఐఎస్ఐ ద్వారా ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. వీరు యువతను సమూలంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తగిన శిక్షణ అనంతరం యువతను భారత్‌పై దాడికి పంపిస్తారని తెలుస్తోంది. కాగా గత మార్చి 1న, ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాకర్ అయిన పైలట్ జహూర్ ఇబ్రహీంను కాల్చి చంపారు. ఈ జైషే మహ్మద్ ఉగ్రవాదిపై గుర్తుతెలియని ముష్కరులు అతి సమీపం నుంచి రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ హత్యల పరంపర పాకిస్తాన్ చట్ట అమలు సంస్థలను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐని కలవరపరిచింది. అయితే ఈ హత్యలు ప్రత్యర్థుల కారణంగా జరిగాయని కూడా ఐఎస్ఐ పూర్తిగా విశ్వసించడం లేదు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచిచూడాలి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌తో యుద్ధం.. హమాస్ కీలక ప్రకటన 🚨 Breaking : Sadiq, Sher Afzal, Fiyaz, Ghulam Rasool & Hafizullah, all Terπ0rists belonging to Lashkar-e-Taiba, have been abducted by #Unknown Gunmen in Neelum Valley, #PoK. News Source : Unknown (not confirmed yet)#IndianArmy #Kashmir#Pakistan #Hamas #ISIS pic.twitter.com/uhrybSj4qf — शून्य (@Shunyaa00) October 28, 2023 -
SP సుమతి గురువు ఎవరో తెలుసా..?
-
'విక్రమ్ ల్యాండర్ నేనే డిజైన్ చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి..
అహ్మదాబాద్: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకిన క్షణాన దేశం అంతా ఉప్పొంగిపోయింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకగానే.. ఓ వ్యక్తి ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తాను ఇస్రోలో చంద్రయాన్ 3 మిషన్‌లో పనిచేశానని చెప్పుకున్నాడు. తాను తయారు చేసిన ల్యాండర్ డిజైన్ జాబిల్లిని తాకిందని గొప్పలకు పోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూరత్‌కు చెందిన మితుల్ త్రివేది.. ఇస్రోలో పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నట్లు చెప్పుకున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవగానే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు సూరత్ పోలీసు కమీషనర్ అజయ్ తోమర్ తెలిపారు. లోకల్ మీడియాలో ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలినట్లు వెల్లడించారు. త్రివేది ఇన్‌స్టాలో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయనకు పీహెచ్డీ ఉన్నట్లు చెప్పుకోవడం కూడా అబద్ధమేనని వెల్లడించారు. ఆయనకు కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నాసాకు ఫ్రీలాన్సర్‌గా పనిచేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్‌లో భాగమేనని వెల్లడించారు. మరోమారు మితుల్ త్రివేదిని ప్రశ్నించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు -
ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?.. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే?
మన దేశంలో చాలామంది తమ స్మార్ట్ ఫోన్ కవర్ లోపలివైపు 10, 20, 50, 100, 500 నోట్లు పెడుతుంటారు. రూపాయి నోట్లను ఫోన్ కవర్లో పెడితే అత్యవసర సమయంలో పనికి వస్తుందని భావిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎంతవరకూ ప్రమాదకరంగా పరిణమిస్తుందో చాలామందికి తెలియదు. కరెన్సీ నోట్లను ఇలా పెట్టడంవలన ఆ ఫోను కలిగినవారి ప్రాణాలు గాలిలో కలసిపోయే అవకాశం ఉంది. ఫోన్ కవర్లో రూపాయినోట్లను ఉంచడం ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. వేడిని బయటకు విడుదల కానివ్వదు ఫోన్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు అది వేడిగా మారడాన్ని గమనించే ఉంటాం. ఫోన్ వేడెక్కిన వెంటనే ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఫోన్ కవర్లో కరెన్సీ నోటు ఉన్నట్లయితే, అప్పుడు ఫోన్ నుంచి వేడి బయటకు విడుదల కాదు. దీంతో ఆ ఫోను పేలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఫోన్‌కు బిగుతుగా ఉండే కవర్‌ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే అది ఫోన్ పేలిపోయేలా చేస్తుందని అంటుంటారు. నోట్ల రసాయనాలు ప్రాణాంతకం కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేస్తారు. అలాగే అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. ఫోన్ వేడెక్కిన సందర్భంలో.. అది బయటకు వెలువడకుండా రసాయినాలతో కూడిన కరెన్సీ నోటు అడ్డు పడితే ఆ పోన్ పేలిపోయేందుకు అవకాశం ఏర్పుడుతుంది. అందుకే పొరపాటున కూడా ఫోన్ కవర్లో ఎలాంటి కరెన్సీ నోటును ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫోన్ కవర్ బిగుతుగా ఉన్నా, అది పేలిపోయే అవకాశం ఉందని, అందుకే ఫోన్ కవర్ ఎంపికలో జగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
స్టేషన్‌కు వచ్చి చూస్తే రైలు లేదు.. రాలేదనుకుంటా? అంతలోనే షాక్!
ముంబయి: గోవా ఎక్స్‌ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్మాడ్ స్టేషన్లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు. వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని మన్మాడ్కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్మాడ్ స్టేషన్‌కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు. మన్మాడ్ స్టేషన్లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్లో గోవా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బడా టెక్నాలజీ కంపెనీల ఆవిష్కరణలకు సంబంధించి సరైన నియంత్రణల రూప కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ఫలితంగా సమాజానికి నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఫిక్కీ నిర్వహించిన ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్) కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. మంచి కోసం ఆవిష్కృతమైన ఇంటర్నెట్.. ఇప్పుడు రిస్క్‌గా మారిందని, యూజర్లకు హాని కలిగించడంతోపాటు, నేరాలకు నిలయమైనట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఐజీఎఫ్, పేరొందిన వేదికలు.. ఈ పెద్ద టెక్నాలజీ సంస్థలు చేయాల్సిన, చేయకూడని వాటి విషయంలో, అవసరమైన నిబంధనలు తీసుకురావడంలో వెనుకబడినట్టు చెప్పారు. ‘‘మనం చాలా కాలంగా వీటిని ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణలుగా చూశాం. అంతేకానీ, ఆ ఆవిష్కరణలు హాని కలిగించొచ్చని, సమాజంలో, ప్రజల్లో ఇతర నష్టాలకు దారితీయగలవని గుర్తించలేకపోయాం’’అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నందున భద్రత, విశ్వసనీయ అన్నవి ప్రభుత్వానికి ముఖ్యమైన పరిష్కరించాల్సిన అంశాలుగా చెప్పారు. ‘‘పెద్దలు, విద్యార్థులు, పిల్లలు, మహిళలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. కనుక ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఆన్లైన్లో భద్రత, విశ్వసనీయత, జవాబుదారీ అన్నవి ఎంతో ముఖ్యమైన విధానపరమైన అంశాలు’’అని పేర్కొన్నారు. -
కె.జి.యఫ్కు ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా?
తీసింది రెండే రెండు సినిమాలు. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరడంతోనే ప్రశాంత్ నీల్ ఆగిపోలేదు. కె.జి.యఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పాన్ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. కేవలం డబ్బు సంపాదన కోసమే సినిమాలు తీయాలనే ఆలోచనతో ఫిల్మ్‌మేకింగ్ కోర్సులో చేరాడు ప్రశాంత్. అయితే.. సినిమా అనే సముద్రం యొక్క లోతు అతని ఆలోచనని మార్చేసింది. ఎలాగైనా కన్నడ సినిమాను ఏలేయాలన్న కసితో అడుగులు వేయించింది. మొదట్లో రెండు, మూడు చిన్న సినిమాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పని చేశాడు. ఆ టైంలోనే సొంతంగా ఓ కథ రాసుకుని సినిమా తీయాలనుకున్నాడు. కొత్తవాడు.. పైగా ‘రొటీన్’ కథ. అందుకే హీరోలెవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. దీంతో తన బావ, హీరో శ్రీమురళిని పెట్టి సినిమా తీశాడు ప్రశాంత్. రిజల్ట్.. ‘ఉగ్రం’(2014) హిట్ టాక్‌తో కన్నడనాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే ఊరమాస్ డైరెక్టర్‌గా ప్రశాంత్‌కి పేరొచ్చింది. షోలే ఇన్స్పిరేషన్తో.. ‘ఉగ్రం’ తరువాత ప్రశాంత్‌తో సినిమా చేస్తామని అడిగినోళ్లంతా కన్నడ స్టార్ హీరోలే. కానీ, ఈ సైలెంట్ డైరెక్టర్ మాత్రం హీరోల బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లే కథ రాసుకుంటాడు. అందుకే అప్పటికే యశ్ కోసం కె.జి.యఫ్ స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఈ కథకి ప్రశాంత్‌కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది బాలీవుడ్ కల్ట్‌క్లాసిక్ ‘షోలే’. 70వ దశకంలో హిందీ సినిమాలు తనలో ఎంతో మార్పులు తీసుకొచ్చాయని, సినిమాను చూసే విధానంలో తనలో మార్పులు తీసుకొచ్చాయని, కె.జి.యఫ్ కథ తయారు చేసుకోవడంలో స్ఫూర్తి ఇచ్చిందని నీల్ అంటున్నాడు. ప్రత్యేకించి ఆ టైంలో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరున్న అమితాబ్ బచ్చన్ స్ఫూర్తితోనే యశ్ రాకీ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దానని నీల్ తెలిపాడు. భారీ బడ్జెట్.. అయినా వెనకడుగు వేయలేదు నిజానికి మొదట ఒక ఫ్యామిలీ స్టోరీతో ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్(హోంబల్ ఫిల్మ్స్)ని అప్రోచ్ అయ్యాడు ప్రశాంత్. ఫైనల్‌గా భారీ బడ్జెట్ కథ కె.జి.యఫ్తో కన్విన్స్ అయ్యారు. కన్నడలో కోలార్ బంగారు గనుల మీద ఇంతదాకా ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ‘కాంట్రవర్సీల’ భయాన్ని లెక్కచేయకుండా డేర్‌గా ప్రశాంత్–విజయ్–యశ్‌లు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఐదు భాషల్లోనూ భారీ సక్సెస్‌తో కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. అంతేకాదు అప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్ల కరువుతో ఉన్న శాండల్‌వుడ్ దాహాన్ని కె..జి.యఫ్ ఛాప్టర్–1తో తీర్చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. #KGF first look @NimmaYash #HombaleFilms #PrashanthNeel #Massssss pic.twitter.com/xWjXR0Apfg — Karthik Gowda (@Karthik1423) May 3, 2017 సగం బలం అతనే! అమ్మ సెంటిమెంట్, పవర్ఫుల్ డైలాగులు, హీరో ఎలివేషన్, సినిమాకు తగ్గట్లు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, నటన, టేకింగ్.. ఇవన్నీ ఒక వైపు ఉంటే.. సంగీతం ఈ సినిమాకు మిగతా సగం బలం. ప్రశాంత్ నీల్ తీసిన మూడు సినిమాలకు(కె.జి.యఫ్ ఛాప్టర్–2తో కలిపి).. ప్రభాస్‌తో తీయబోయే ‘సలార్’కి మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరే. అతని పేరు రవి బస్రూర్. రవికి తన రెండో మూవీ ‘ఉగ్రం’తోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొచ్చింది. అయితే వీళ్లిద్దరి కాంబో మూవీస్ సక్సెస్‌లో మ్యూజిక్ మామూలు రోల్ పోషించదు. ప్రత్యేకించి సీన్ ఎలివేషన్ కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ప్రాణం పెడతాడు రవి. ఆ అవుట్ఫుల్ జనాలను సీటు అంచుకి తీసుకొస్తుంది కూడా. కె.జి.యఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ సందర్భంగా.. సాక్షి వెబ్ ప్రత్యేకం -
హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదు.. అసలు పేరు ఏంటంటే?
సాక్షి,పంజగుట్ట: హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదని, కులీకుతుబ్‌షా కాలంలోనే ఈ నగరానికి హైదరాబాద్‌గా నామకరణం చేశారని చరిత్ర కారులు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ సంపాదకులు కింగ్సుఖ్నాగ్, పరిశోధకులు సయ్యద్ ఇనాముర్ రహమాన్ ఘయుర్లతో కలిసి మాట్లాడుతూ... భాగమతి ప్రేమకు చిహ్నంగా కులీకుతుబ్‌షా భాగ్యనగర్‌ను నిర్మించారనడంలో వాస్తవం లేదన్నారు. 1590లో గోల్కొండలో ప్లేగు వ్యాధి ప్రబలడంతో రాజు తన పరివారంతో మూసీ నది దక్షిణాన విడిది చేశారని, అక్కడ వేడి ఎక్కువగా ఉండటం, రాజవాసం ఎవరికీ కనబడకుండా ఉండేందుకు తోటలు ఏర్పాటు చేయించారని ఆ సమయంలో ఒక ఫ్రాన్స్ దేశస్తుడు అన్ని తోటలు చూసి ‘బాగ్ నగర్’గా తన పుస్తకంలో రాసుకున్నారన్నారు. కులీకుతుబ్‌షా అనుమతితో రెండో ఖలీఫా అయిన లలీ తన మరోపేరు హైదర్ కావడంతో ఈ ప్రాంతానికి హైదరాబాద్‌గా నామకరణం చేశారన్నారు. చదవండి: గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని.. -
బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్
కొన్ని విలువైన వస్తువులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ నష్టాన్ని భర్తి చేయడం కోసం సాధారణంగా మనం ఇల్లు, కారు, వాహనాలకు బీమా చేయడం కొత్తేమీ కాదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆ బీమా డబ్బుని క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహాలోనే కొందరు సెలబ్రిటీలు తమ శరీర భాగాలకు ఇన్సురెన్స్ చేయించుకుంటుంటారు. ఈ జాబితాలో తారలు కూడా ఉన్నారు. తాజాగా బ్రేజిల్‌లో ఓ మోడల్ కూడా తన బాడీలోని ఓ పార్ట్‌ను ఏకంగా 13 కోట్ల రూపాయలకు ఇన్సురెన్స్ చేయించుకుంది. ఇంతకీ ఏంటా పార్ట్ అంటారా? ఆ మోడల్ తన పిరుదులను ఇన్సురెన్స్ చేయించుకుంది. ప్రత్యేకంగా వాటికే ఎందుకంటే.. బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారాకు తన పిరుదులే అందం. వాటి వల్లనే తను మిస్ బుమ్‌బుమ్ 2021 వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె తన పిరుదుల కారణంగానే ప్రసిద్ధి చెందానని, అందుకే వాటికి £1.3 మిలియన్లకు (సుమారు రూ. 13 కోట్లు) బీమా చేయించుకుంటున్నట్లు చెప్పింది. నాథీ ఈ విషయమై మాట్లాడుతూ.. నా పిరుదులు పూర్తిగా సహజమైనది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ పొందుతున్నాను. తల్లిగా మారిన తర్వాత జిమ్‌లో బరువులు ఎత్తడం కంటే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. చదవండి: Britney Spears: నా జీవితంలో ఇదే అత్త్యుత్తమ రోజు: బ్రిట్నీ స్పియర్స్ భావోద్వేగం -
పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు
సాక్షి, తిరువనంతపురం: పెంపుడుకుక్కను దారుణంగా కారుకు కట్టి నడిరోడ్డుపై లాక్కెళ్లిన క్రూర చర్య సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదీ 62 ఏళ్ల ఒక పెద్దాయన కనీసం కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించిన వైనంపై నెటిజన్లులు మండిపడుతున్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తనను బాగి విసిగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన యూసఫ్ ఆప్రాంతం నుండి కుక్కను దూరంగా తీసుకెళ్లి వదిలిరావాలని అనుకున్నాడు. అంతే క్షణం ఆలోచించకుండా.. ఏ మాత్రం దయ లేకుండా కుక్కను కారుకు కట్టేసి మరీ లాక్కెళ్లిపోయాడు. ఈ అమానుషాన్ని గమనించిన అఖిల్ అనే బైకర్ వీడియో తీశారు. ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తామంటూ ఆయన యూసఫ్‌ను అడ్డుకుని ప్రశ్నించారు. అయితే...నీకేంటి సమస్య అంటూ వాదించిన యూసఫ్ చివరకు కుక్కకు కట్టిన తాడును వదిలించి అక్కడినుంచి వెళ్లి పోయారు. దీనిపై వ్యవహారంపై అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కారు యజమాని యూసుఫ్‌పై చెంగమండ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే (ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, 1960) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిని అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశామని పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన కుక్కను ప్రభుత్వ పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించినట్టు చెప్పారు. -
ఇండిగో మరో నిర్వాకం
ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో నిర్వాకం ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసింది. ప్రయాణికుడి పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే తాజాగా మరో వివాదంతో ఇండిగో సంస్థ వారల్లో నిలిచింది. సంబంధిత ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఉండగానే అనుకున్న సమయానికంటే.. విమానం ముందుగా బయలుదేరిపోవడం ఆందోళన రేపింది. గోవా నుంచి హైదరాబాద్ విమానం షెడ్యూల్ సమయానికి కంటే ముందుగానే టేక్ఆఫ్ తీసుకుంది. దీంతో బోర్డింగ్ పాస్‌లతో ఎదురుచూస్తున్న 14 మంది ప్రయాణికులు ఉసూరుమన్నారు. ఇదేమి నిర్వాకమంటూ ఎయిర్‌లైన్స్‌పై మండిపడుతున్నారు. గోవా విమానాశ్రయంలో సోమవారం ఈ ఘటన చోటుసుకుంది. 6ఈ 259 ఇండిగో విమానం సోమవారం రాత్రి 10.50 గంటలకు గోవానుంచి బయలుదేరాల్సి ఉంది, కానీ ఎటువంటి ప్రకటన చేయకుండానే 25 నిమిషాల ముందు బయలుదేరిపోయిందని ప్రయాణీకులు ఆరోపించారు. హైదరాబాద్ విమానాశ్రయానికి 12.05 లకు చేరాల్సి ఉండగా, 11.40 నిమిషాలకే చేరుకుందని వాదించారు. మేము లేకుండా తమ లగేజీ విమానంలో ఎలా తీసుకెళ్తారు.. ఇది సెక్యూరిటీ లోపం కాదా అని ప్రయాణికుడు డా. సుదర్శన్ ప్రసాద్ ధ్వజమెత్తారు. కనీసం ఎనౌన్స్మెంట్ కూడా చేయలేదని మరో ప్రయాణికుడు ఆరోపించారు. అంతేకాదు టికెట్లకోసం రూ.55,000 చెల్లించమని అడిగారని పాసెంజర్ ఆరాధన పోదావల్లి వాపోయారు. సమయానికి ఎవరైనా ప్రయాణికులు రాకపోతే... ఎలాంటి తటపటాయింపు లేకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే ఎయిర్ లైన్స్ అధికారులు.. విమానాన్నిఎందుకు ముందుగా పంపించాల్సి వచ్చింది.. మరి దీనికి జరిమానా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇండిగో అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రయాణికుల వాదనలను వ్యతిరేకించారు. అనేకసార్లు లౌడ్ స్పీకర్లో ప్రకటించినా ఫలితం లేకపోవడంతో వారి ప్రయాణికులు అందించిన ఫోన్ నంబర్లను సంప్రదిస్తే..వారి ట్రావెల్ ఏజెంట్ థామస్ కుక్ రిసీవ్ చేసుకున్నారని, పాసెంజర్ల ఫోన్ నంబర్లు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపింది. అంతేకాదు వారికోసం అనేక ప్రయత్నాలు చేశామని ఆయన తెలిపారు. బోర్డింగ్ గేటు దగ్గరికి అనుకున్న సమయం రాత్రి10.30కే ముగియగా వారు 10.33కు చేరుకున్నారు అందు వారిని "గేట్ నో-షో"గా ప్రకటించినట్టు తెలిపారు. అలాగే తమవైపు ఎలాంటి తప్పు లేకున్నా...వారిని మరుసటి విమానంలో ఉచితంగా తరలించామంటూ తమని తాము సమర్ధించుకున్నారు. -
పదవి ఇవ్వలేదని ఒత్తిడే భూమాను కుంగ దీసిందా ?
-
దీపావళి వెలుగుల వెనుక చీకటి బతుకులు
-
నయీం వెనుక నాయకులు
-
పెను విషాదాన్ని మిగిల్చిన 'సన్ ప్లవర్'
కేరళ: వందమందికి పైగా భక్తులను పొట్టన పెట్టుకున్న కేరళ కొల్లాంలోని పుట్టింగళ్ ఆలయంలోని అగ్ని ప్రమాదానికి 'సన్‌ఫ్లవర్' బాణాసంచా కారణమని ప్రాథమికంగా తేలింది. సన్ ఫ్లవర్ అనేది బాణాసంచా లోని ఒక రకం. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది లాగానే ఆకాశంలో మెరిసే ఈ బాణాసంచాను కాల్చినపుడు ప్రమాదవశాత్తూ దాని నిప్పురవ్వలు పక్కనే పేలుడు పదార్థంతో నిండివున్న భవనంపై పడటంతో ఒక్కసారిగా పేలడు సంభవించినట్టు తెలుస్తోంది. సన్‌ఫ్లవర్ అనేది ఆకాశంలో మెరిసే ఫైర్ వర్క్. సూర్యకాంతి(సన్ ప్లవర్) బాణా సంచా ప్రదర్శన ఏడు దశల్లో ఉంటుంది. ఇది చివరకు ఒక పొద్దుతిరుగుడు పువ్వు ఆకారంలో ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతుంది. మూడు గంటల పాటూ సాగే బాణాసంచా ప్రదర్శనలో ప్రతి ఏడాది దీనిని కూడా కాలుస్తారు. ప్రదర్శన ముగించడానికి ముందు ఈ సన్ ఫ్లవర్ ను వెలిగిస్తారు. కాగా ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం... 'సూర్య కాంతి' బాణాసంచా మొదటిసారి ప్రయోగించినపుడు విఫలమై నేల మీదే పేలిపోయింది. ఈ సందర్భంగా ఇద్దరు గాయపడ్డారు. రెండవసారి కూడా ఇలానే జరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. చివరికి నాలుగోసారి కూడా మధ్యలోనే పేలిపోయింది. దీంతో నిప్పు రవ్వలు ఎగిసిపడి నేరుగా కంబాపురాలోని కాంక్రీటు భవనంపై పడి సెకన్లలో పేలుడు సంభవించింది. దేవస్థానం బోర్డు కార్యాలయంతో పాటు చుట్టుపక్కల కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంస'మైనట్లు తెలిపాడు. ఈ ప్రమదాం తరువాత దేవాలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, పైరో టెక్నిక్స్ కాంట్రాక్టర్లు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున జరిగిన బాణాసంచా ప్రమాదంలో 109 మంది చనిపోగా, 400మందికి పైగా గాయపడ్డారు. దీనిపై పోలీసులు ఇంకా పరిశోధిస్తున్న సంగతి తెలిసిందే. -
తెల్ల జుట్టు రహస్యం తెలిసిపోయిందోచ్!
జుట్టుకు రంగు వేసుకొని.. వేసుకొని విసిగిపోయారా? ఇక ఆ రంగులకు, బ్రష్‌లకు ప్యాకప్ చెప్పేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అందరినీ వేధిస్తున్న తెల్లజుట్టు బెంగ ఇక అక్కర్లేదట. జుట్టు తెల్లబడటానికి కారణమైన జన్యువును కనుగొన్నామని.. ఇది మరింత విప్లవాత్మక మార్పులకు దారితీయనుందని లండన్ పరిశోధకులు చెబుతున్నారు. ఐఆర్ఎఫ్ 4 అనే జన్యువు వల్లే జుట్టు రంగు మారుతోందని గుర్తించారు. మెలనిన్‌ను నియంత్రిస్తున్న ఈ జన్యువే జుట్టును కూడా తెల్లబరుస్తోందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ ఆవిష్కరణతో జట్టు తెల్లబడటాన్ని నిరోధించడం భవిష్యత్తులో సాధ్యమే అంటున్నారు. జుట్టు రంగు, సాంద్రత, ఆకారాన్ని ప్రభావితం చేసే జన్యువులను గుర్తించేందుకు లాటిన్ అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరువేల మందిపై ఈ పరిశోధన సాగింది. జుట్టు తొందరగా తెల్లబడటానికి కేవలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు కాకుండా.. మనిషిలోని జన్యువే ప్రధాన పాత్ర పోషిస్తోందని లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు. బట్టతల రావడానికి, జుట్టు రంగును మార్చే జన్యువులను ఇప్పటికే గుర్తించినా, మానవుల్లో జుట్టు తెల్లగా మారడానికి కారణమైన జన్యువును గుర్తించడం ఇదే ప్రథమమని, చాలా కీలకమైందంని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్) కు చెందిన డాక్టర్ కౌస్తుభ్ అధికారి చెప్పారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగని పరిశోధన అని పేర్కొన్నారు. ఇది కాస్మోటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందంటున్నారు. మానవ వృద్ధాప్య జీవశాస్త్రం అంశాల పరిశోధనలో తమ అధ్యయనం మంచి పరిణామమని ప్రొఫెసర్ ఆండ్రెస్ రూయిజ్- లినారెస్ చెప్పారు. గడ్డం దగ్గర జుట్టు మందం, కనుబొమ్మల మందాన్ని, వైవిధ్యాన్ని నియంత్రించే జన్యువులను కూడా తమ పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. వేసవిలో మెదడును చల్లగా ఉంచేందుకు ఉంగరాల జుట్టు సహాయపడుతుందని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. ఉత్తర, దక్షిణ ప్రాంత వాసుల జుట్టు స్ట్రయిట్‌గా ఉండటానికి కూడా ఇదే కారణమన్నారు. తీవ్రమైన చలి నుంచి తట్టుకునేందుకు వీలుగా వారి జుట్టు సాదాగా ఎదుగుతుందంట. యూరోపియన్లలో 20 ఏళ్లకు ముందు, తూర్పు ఆసియన్లలో 30లలో, సహారా ఆఫ్రికన్లలో 40లలో జుట్టు తెల్లబడటం మొదలవుతుందని తెలిపారు. భారత సంతతికి చెందిన డాక్టర్ కూడా భాగస్వామిగా ఉన్న ఈ పరిశోధన.. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. -
భార్య పని చేయడం లేదని..
తన భార్య ఇంటి పని, వంట పని సరిగా చేయట్లేదంటూ.. కుటుంబ కష్టాలపై ఓ భర్త కోర్టుకెక్కాడు. 'మిస్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ' అంటూ తాను పడుతున్న కష్టాలను వివరించాడు. అయితే ఇదే సందర్భంలో భర్త వల్ల ఆమె ఆరేళ్లుగా నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్న నరకం కూడా బయటపడింది. 40 ఏళ్ల వయసున్న తన భార్య.. పనిచేయడంలో వెనుకబడిందని, కుటుంబాన్ని సరిగా చూడట్లేదని ఓ భర్త కోర్టుకెక్కాడు. వంట పనిలోనూ, ఇల్లు శుభ్రపరిచే విషయంలోనూ ఆమె పరమవీక్ అంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య అపరిశుభ్రతను, బద్ధకాన్ని భరింలేకపోతున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో జీవించలేకపోతున్నానని వాపోయాడు. రెండేళ్లుగా ఈ పరిస్థితులతో తీవ్రకష్టాలు అనుభవిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. అయితే స్థానికులు మాత్రం అతడి ఆరోపణలు నిజం కాదంటున్నారు. భర్త తరచుగా భార్యను వేధిస్తుంటాడని, కొని తెచ్చిన వంటకాలను దూరంగా విసిరి పారేస్తాడని, ఆమే వంట చేయాలంటాడని తెలిపారు. లేదంటే ఆమెను శారీరకంగా హింసిస్తుంటాడని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టుకు పత్రాలు సమర్పించిన బాధితురాలు.. తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది. భర్త చేస్తున్న ఫిర్యాదులు నిజం కాదంది. ఆరేళ్లుగా అతనితో నరకం అనుభవిస్తున్నాని, కోర్టుకు వచ్చేముందు కూడా తనను కొట్టాడని తెలిపింది. ఇటలీ సొన్నినో లాజియోకి చెందిన ఆమె... ఆరేళ్లుగా భర్త వేధింపులను భరిస్తూ కాలం గడుపుతున్నానని, తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని న్యాయస్థానానికి విన్నవించింది. ప్రస్తుతం ఆ భార్య భర్తల వివాదంలో విచారణను కోర్టు అక్టోబర్ నాటికి వాయిదా వేసింది. -
గాలిలో గారడి