సాక్షి,పంజగుట్ట: హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదని, కులీకుతుబ్‌షా కాలంలోనే ఈ నగరానికి హైదరాబాద్‌గా నామకరణం చేశారని చరిత్ర కారులు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ సంపాదకులు కింగ్‌సుఖ్‌నాగ్, పరిశోధకులు సయ్యద్ ఇనాముర్ రహమాన్ ఘయుర్‌లతో కలిసి మాట్లాడుతూ... భాగమతి ప్రేమకు చిహ్నంగా కులీకుతుబ్‌షా భాగ్యనగర్‌ను నిర్మించారనడంలో వాస్తవం లేదన్నారు.
1590లో గోల్కొండలో ప్లేగు వ్యాధి ప్రబలడంతో రాజు తన పరివారంతో మూసీ నది దక్షిణాన విడిది చేశారని, అక్కడ వేడి ఎక్కువగా ఉండటం, రాజవాసం ఎవరికీ కనబడకుండా ఉండేందుకు తోటలు ఏర్పాటు చేయించారని ఆ సమయంలో ఒక ఫ్రాన్స్ దేశస్తుడు అన్ని తోటలు చూసి ‘బాగ్ నగర్’గా తన పుస్తకంలో రాసుకున్నారన్నారు. కులీకుతుబ్‌షా అనుమతితో రెండో ఖలీఫా అయిన లలీ తన మరోపేరు హైదర్ కావడంతో ఈ ప్రాంతానికి హైదరాబాద్‌గా నామకరణం చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment