original name
-
హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదు.. అసలు పేరు ఏంటంటే?
సాక్షి,పంజగుట్ట: హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదని, కులీకుతుబ్‌షా కాలంలోనే ఈ నగరానికి హైదరాబాద్‌గా నామకరణం చేశారని చరిత్ర కారులు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ సంపాదకులు కింగ్సుఖ్నాగ్, పరిశోధకులు సయ్యద్ ఇనాముర్ రహమాన్ ఘయుర్లతో కలిసి మాట్లాడుతూ... భాగమతి ప్రేమకు చిహ్నంగా కులీకుతుబ్‌షా భాగ్యనగర్‌ను నిర్మించారనడంలో వాస్తవం లేదన్నారు. 1590లో గోల్కొండలో ప్లేగు వ్యాధి ప్రబలడంతో రాజు తన పరివారంతో మూసీ నది దక్షిణాన విడిది చేశారని, అక్కడ వేడి ఎక్కువగా ఉండటం, రాజవాసం ఎవరికీ కనబడకుండా ఉండేందుకు తోటలు ఏర్పాటు చేయించారని ఆ సమయంలో ఒక ఫ్రాన్స్ దేశస్తుడు అన్ని తోటలు చూసి ‘బాగ్ నగర్’గా తన పుస్తకంలో రాసుకున్నారన్నారు. కులీకుతుబ్‌షా అనుమతితో రెండో ఖలీఫా అయిన లలీ తన మరోపేరు హైదర్ కావడంతో ఈ ప్రాంతానికి హైదరాబాద్‌గా నామకరణం చేశారన్నారు. చదవండి: గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని.. -
విశ్వక్ సేన్ అసలు పేరు ఏంటో తెలుసా?
యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం పాగల్. వెళ్లిపోమాకే అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన విశ్వక్సేన్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్, ఫలక్‌నుమా దాస్ వంటి చిత్రాలతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న తాజాగా పాగల్‌తో ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటా అంటూ విశ్వక్సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విశ్వక్సేన్ పేరు మార్చుకోవాలంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో 'మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ, దయచేసి దాడి చేయకండి' అంటూ విశ్వక్సేన్ కోరాడు. ఈ విషయం పక్కన పెడితే అసలు విశ్వక్సేను అసలు పేరు ఇదేనా లేక మరొకటి ఏమైనా ఉందా అంటూ కొందరు ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారట. నిజానికి విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. కానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక విశ్వక్సేన్గా పేరు మార్చుకున్నాడు. అంతేకాకుండా ఈ పేరు కూడా విశ్వక్‌కు బాగానే కలిసొచ్చినట్లుంది. దీంతో అలా కంటిన్యూ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. చదవండి : ప్రియాంక చోప్రాకు భలేఛాన్స్.. ‘మామి’ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్ 'నాకు బాంబేనే బ్యాక్‌గ్రౌండ్' అంటున్న సంపూర్ణేశ్ బాబు -
అసలు పేరు చెప్పి దొరికిపోయాడు!
మాఫియా డాన్ ఛోటా రాజన్ ఎలా పట్టుబడ్డాడన్నది ఇప్పటివరకు సరిగ్గా వెలుగులోకి రాలేదు. నిజానికి బాలిలో విమానం దిగిన తర్వాత అక్కడి అధికారులకు తన పేరును పాస్‌పోర్టు మీద ఉన్న 'మోహన్ కుమార్' అని కాకుండా, తన అసలు పేరైన 'రాజేంద్ర నికల్జే' అని చెప్పాడట. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, ఇంటర్‌పోల్ వర్గాలు విచారించాయి. అతడి వేలిముద్రలు, ఇతర వివరాలు తమ వద్ద ఉన్న డేటాలో ఛోటా రాజన్ వివరాలతో సరిపోవడంతో భారతదేశంలో ఉన్న ఇంటర్‌పోల్ అధికారులకు బాలి ఇంటర్‌పోల్ అధికారులు ఈ విషయం చెప్పారు. రాజన్ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సీబీఐ బృందం వెంటనే బాలి వెళ్లి, రాజన్‌ను వెంట పెట్టుకుని తీసుకొచ్చింది. కోర్టులో సీబీఐ వర్గాలు అతడిని ప్రవేశపెట్టగా, కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి రాజన్‌ను పంపింది. ఢిల్లీలో దిగిన కాసేపటికే సీబీఐ వర్గాలు ఛోటా రాజన్‌ను అరెస్టు చేశాయి. నకిలీ పత్రాల ఆధారంగా పాస్‌పోర్టు తీసుకున్న నేరంలో ముందుగా అరెస్టు చేశారు. మోహన్ కుమార్ అనే పేరుతో రాజన్‌కు పాస్‌పోర్టు ఉంది. దీంతో పాస్‌పోర్టు చట్టం ప్రకారం మోసం, ఫోర్జరీ తదితర నేరాలకు గాను అతడిని అరెస్టు చేశారు. ముంబై పోలీసులు ఇంకా అధికారికంగా రాజన్ మీద ఉన్న కేసులను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేయాల్సి ఉంది కాబట్టి, అరెస్టు చేయడానికి తక్షణ కారణం వెతుక్కోవాల్సి వచ్చింది. శనివారం నుంచి ఈ ఐదు రోజుల్లో రాజన్‌ను సీబీఐ వర్గాలు ఇంటరాగేట్ చేస్తాయి. ఇప్పటివరకు ముంబై పోలీసులలో ఎవరెవరు దావూద్ ఇబ్రహీం కోసం పనిచేస్తున్నారో వాళ్ల పేర్లు వెల్లడించలేదు కాబట్టి దాని కోసమే ముందుగా దర్యాప్తు సాగొచ్చని తెలుస్తోంది.