యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం పాగల్. వెళ్లిపోమాకే అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన విశ్వక్‌సేన్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్, ఫలక్‌నుమా దాస్ వంటి చిత్రాలతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న తాజాగా పాగల్‌తో ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా కరోనాతో మూత పడిన థియేటర్లను పాగల్‌తో ఓపెన్ అయ్యేలా చేస్తానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటా అంటూ విశ్వక్‌సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విశ్వక్‌సేన్ పేరు మార్చుకోవాలంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో 'మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్న లోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ, దయచేసి దాడి చేయకండి' అంటూ విశ్వక్‌సేన్ కోరాడు.
ఈ విషయం పక్కన పెడితే అసలు విశ్వక్‌సేను అసలు పేరు ఇదేనా లేక మరొకటి ఏమైనా ఉందా అంటూ కొందరు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారట. నిజానికి విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. కానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక విశ్వక్‌సేన్‌గా పేరు మార్చుకున్నాడు. అంతేకాకుండా ఈ పేరు కూడా విశ్వక్‌కు బాగానే కలిసొచ్చినట్లుంది. దీంతో అలా కంటిన్యూ అవుతున్నాడు ఈ యంగ్ హీరో.
చదవండి : ప్రియాంక చోప్రాకు భలేఛాన్స్.. ‘మామి’ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం
కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్
'నాకు బాంబేనే బ్యాక్‌గ్రౌండ్' అంటున్న సంపూర్ణేశ్ బాబు
Comments
Please login to add a commentAdd a comment