పెను విషాదాన్ని మిగిల్చిన 'సన్ ప్లవర్'
కేరళ: వందమందికి పైగా భక్తులను పొట్టన పెట్టుకున్న కేరళ కొల్లాంలోని పుట్టింగళ్ ఆలయంలోని అగ్ని ప్రమాదానికి 'సన్‌ఫ్లవర్' బాణాసంచా కారణమని ప్రాథమికంగా తేలింది. సన్ ఫ్లవర్ అనేది బాణాసంచా లోని ఒక రకం. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది లాగానే ఆకాశంలో మెరిసే ఈ బాణాసంచాను కాల్చినపుడు ప్రమాదవశాత్తూ దాని నిప్పురవ్వలు పక్కనే పేలుడు పదార్థంతో నిండివున్న భవనంపై పడటంతో ఒక్కసారిగా పేలడు సంభవించినట్టు తెలుస్తోంది.
సన్‌ఫ్లవర్ అనేది ఆకాశంలో మెరిసే ఫైర్ వర్క్. సూర్యకాంతి(సన్ ప్లవర్) బాణా సంచా ప్రదర్శన ఏడు దశల్లో ఉంటుంది. ఇది చివరకు ఒక పొద్దుతిరుగుడు పువ్వు ఆకారంలో ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతుంది. మూడు గంటల పాటూ సాగే బాణాసంచా ప్రదర్శనలో ప్రతి ఏడాది దీనిని కూడా కాలుస్తారు. ప్రదర్శన ముగించడానికి ముందు ఈ సన్ ఫ్లవర్ ను వెలిగిస్తారు.
కాగా ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం... 'సూర్య కాంతి' బాణాసంచా మొదటిసారి ప్రయోగించినపుడు విఫలమై నేల మీదే పేలిపోయింది. ఈ సందర్భంగా ఇద్దరు గాయపడ్డారు. రెండవసారి కూడా ఇలానే జరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. చివరికి నాలుగోసారి కూడా మధ్యలోనే పేలిపోయింది. దీంతో నిప్పు రవ్వలు ఎగిసిపడి నేరుగా కంబాపురాలోని కాంక్రీటు భవనంపై పడి సెకన్లలో పేలుడు సంభవించింది. దేవస్థానం బోర్డు కార్యాలయంతో పాటు చుట్టుపక్కల కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంస'మైనట్లు తెలిపాడు.
ఈ ప్రమదాం తరువాత దేవాలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, పైరో టెక్నిక్స్ కాంట్రాక్టర్లు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున జరిగిన బాణాసంచా ప్రమాదంలో 109 మంది చనిపోగా, 400మందికి పైగా గాయపడ్డారు. దీనిపై పోలీసులు ఇంకా పరిశోధిస్తున్న సంగతి తెలిసిందే.