తల్లిని చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చిన నిఖిల్‌.. మరి తేజ సంగతి? | Bigg Boss 8 Telugu: Nikhil Gets Emotional Over Seeing His Mother | Sakshi
Sakshi News home page

కుమిలికుమిలి ఏడుస్తున్న తేజ.. రేటింగ్‌ కోసం బిగ్‌బాస్‌ తంటాలు

Published Wed, Nov 13 2024 5:06 PM | Last Updated on Wed, Nov 13 2024 5:17 PM

Bigg Boss 8 Telugu: Nikhil Gets Emotional Over Seeing His Mother

బిగ్‌బాస్‌ షోకివ వచ్చినవాళ్లు కప్పు గెలవకపోయినా పర్లేదు కానీ తమ ఫ్యామిలీ మెంబర్‌ను ఒక్కసారైనా హౌస్‌కు తీసుకురావాలని తహతహలాడతారు. గంగవ్వ కూడా అదే ఆశపడింది. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో సడన్‌గా హౌస్‌ నుంచి నిష్క్రమించింది. అటు గతేడాది బిగ్‌బాస్‌కు వచ్చిన తేజ మరోసారి ఈ సీజన్‌లో అడుగుపెట్టడానికి ప్రధాన కారణం... తన తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలని!

వరస్ట్‌ కంటెస్టెంట్‌
కానీ మెజారిటీ హౌస్‌మేట్స్‌ తేజను వరస్ట్‌ కంటెస్టెంట్‌ అని తేల్చడంతో ఫ్యామిలీ వీక్‌లో అతడి కోసం ఎవరూ రారని నాగ్‌ తేల్చిచెప్పాడు.. ఎంతోమంది ఎన్నో తప్పులు చేసినా, చేస్తూనే ఉన్నా చూసీచూడనట్లు ఉన్న బిగ్‌బాస్‌ తేజకు మాత్రం ఇలాంటి దారుణమైన శిక్ష విధించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

నిఖిల్‌ పశ్చాత్తాపం
ఇది విన్నాక నిఖిల్‌ సైతం పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకంటే తేజను వరస్ట్‌ కంటెస్టెంట్‌ అని డిసైడ్‌ చేసినవారిలో నిఖిల్‌ కూడా ఉన్నాడు. (విష్ణుప్రియ, పృథ్వీ కూడా తేజను చెత్తప్లేయర్‌గా పేర్కొన్నారు) తల్లిని హౌస్‌లోకి తీసుకురావడమే తేజ ఏకైక లక్ష్యం అని అందరికీ తెలుసు! అలాంటిది.. అతడి కోరిక నెరవేరకపోవడానికి తాను కూడా కారణమవుతున్నానని నిఖిల్‌ బాధపడ్డాడు.

తేజ తల్లి వస్తుందా? రాదా?
అయితే నిజంగా తేజ తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశమే లేదా? అంటే కచ్చితంగా ఉంది. టీఆర్పీ కోసం తేజ ఎమోషన్స్‌ను వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందరి ఇంటివాళ్లు వచ్చి వెళ్లాక చివర్లో తేజ ఫ్యామిలీ మెంబర్‌ హౌస్‌లో సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఇక ఈరోజైతే నిఖిల్‌ తల్లి హౌస్‌లోకి వచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. అమ్మను చూడగానే నిఖిల్‌ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement