ముగ్గురు హీరోయిన్లతో 'బిచ్చగాడు' హీరో రొమాన్స్‌ | Vijay Antony Next With Cs Amudhan Titled Ratham | Sakshi
Sakshi News home page

ముగ్గురు హీరోయిన్లతో 'బిచ్చగాడు' హీరో రొమాన్స్‌

Published Mon, Jan 24 2022 8:13 AM | Last Updated on Mon, Jan 24 2022 8:13 AM

Vijay Antony Next With Cs Amudhan Titled Ratham - Sakshi

Vijay Antony Next With Cs Amudhan Titled Ratham: విజయ్‌ ఆంటోని ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేస్తున్నారు. సంగీత దర్శకుడి నుంచి కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు విజయ్‌ ఆంటోని. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి రత్తం అనే టైటిల్‌ను ఆదివారం ఖరారు చేశారు. ఇందులో నటి మహిమ నంబియార్, నందిత శ్వేత, రమ్యానంబీశన్‌ కథానాయికలుగా నటించడం విశేషం. హాస్యనటుడు జగన్‌ కృష్ణ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.


తమిళ్‌పడం చిత్రం ఫేమ్‌ సి ఎస్‌ అముదన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్‌ పతాకంపై కమల్‌ బోరా, లలితా ధనుంజయన్, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌ కలిసి నిర్మిస్తున్నారు. దీనికి గోపి అమర్‌నాథ్‌ ఛాయా గ్రహణాన్ని, కన్నన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement