Meenakshi Chaudhary Romance With Varun Tej Next Film - Sakshi
Sakshi News home page

మెగా హీరోతో ఛాన్స్‌ కొట్టేసిన మీనాక్షీ చౌదరి

Published Mon, Jul 24 2023 5:25 AM | Last Updated on Mon, Jul 24 2023 4:48 PM

Meenakshi Chaudhary romance with Varun tej next - Sakshi

హీరోయిన్  మీనాక్షీ చౌదరి మంచి ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలకు సైన్  చేస్తూ కెరీర్‌లో దూసు కెళుతున్నారీ బ్యూటీ. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో ఓ హీరోయిన్ గా, విశ్వక్‌సేన్  (‘వీఎస్‌10’) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీని తాజాగా మరో అవకాశం వరించిందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘పలాస’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మోహన్‌ చెరుకూరి (సీవీఎం), డా.విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం కానుంది. 1960 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వరుణ్‌ సరసన నటించే చాన్ ్స మీనాక్షీ చౌదరికి దక్కిందన్నది ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ టాక్‌. మరి.. వరుణ్, మీనాక్షీలు ఈ సినిమా కోసం జోడీ కడతారా? వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement