– మీనాక్షీ చౌదరి
‘‘అమ్మ, సిస్టర్, ప్రేయసి, భార్య... ఇలా ఏదో ఒక విధంగా ప్రతి అబ్బాయి జీవితంలో ఓ మహిళ ఉంటుంది. ఆ అబ్బాయి జీవితానికి ఎంతో ముఖ్యంగా ఉంటూ, అతని లైఫ్‌కి ఓ పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. అలా వాసు (‘మట్కా’ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర) జీవితానికి సుజాత (మీనాక్షీ చౌదరి పాత్ర) ఓ వెలుగు వంటిది. సుజాత పాత్రలోని పాజిటివిటీ వాసు జీవితంపై ఉంటుంది.
ఈ పాజిటివిటీకి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. వరుణ్ తేజ్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘మట్కా’లో వాసు ప్రేయసి సుజాతగా నటించాను. సుజాత పాత్రకు మూడు గెటప్స్ ఉంటాయి.
ఈ గెటప్స్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ చూపించడం కొత్తగా అనిపించింది. ‘మట్కా’ విజయంపై నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ చిత్రం ఆల్రెడీ విడుదలై, విజయం సాధించింది. ‘మట్కా’ విడుదలవుతోంది. ఇదే నెలలో ‘మెకానిక్ రాకీ’ చిత్రం విడుదలవుతోంది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ నెల చాలా ప్రత్యేకం. ఓ స్పెషల్ మూమెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment