#VT14: Varun Tej's Next film titled Matka, shooting started - Sakshi

పాన్‌ ఇండియా రేంజ్‌లో 'జూదం' అడేందుకు రెడీ అవుతున్న వరుణ్‌ తేజ్‌

Jul 28 2023 12:58 AM | Updated on Jul 28 2023 10:48 AM

Varun Tej Next film titled Matka, shooting started - Sakshi

విజయేందర్‌ రెడ్డి, మీనాక్షి, వరుణ్‌ తేజ్, సీవీ మోహన్, కరుణ కుమార్‌

వరుణ్‌ తేజ్, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరో  హీరోయిన్లుగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి  ‘మట్కా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్‌ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. తొలి సీన్‌కి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత ‘దిల్‌’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు సురేష్‌బాబు, విజయేందర్‌ రెడ్డి, సీవీఎం కలిసి దర్శకుడు కరుణ కుమార్‌కు స్క్రిప్ట్‌ అందించగా, దర్శకుడు హరీష్‌ శంకర్‌ టైటిల్‌ పోస్టర్‌ లాంచ్‌ చేశారు.

‘‘వరుణ్‌కు ‘మట్కా’ తొలి పాన్‌ ఇండియన్‌ మూవీ. ‘మట్కా’ అంటే ఒక రకమైన జూదం. 1958–1982 మధ్య కాలంలో దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వరుణ్‌ తేజ్‌ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారు. నాటి వైజాగ్‌ను తలపించేలా ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆశిష్‌ తేజ, ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేష్‌ ఆధ్వర్యంలో వింటేజ్‌ సెట్‌ వర్క్‌ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, కెమెరా: ప్రియా సేత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement