సుకుమార్‌తో సినిమా లేదు | Mahesh Babu walks out of Sukumar project over creative differences | Sakshi
Sakshi News home page

సుకుమార్‌తో సినిమా లేదు

Published Wed, Mar 6 2019 3:17 AM | Last Updated on Wed, Mar 6 2019 5:46 AM

Mahesh Babu walks out of Sukumar project over creative differences - Sakshi

మహేశ్‌బాబు

... అని మహేశ్‌బాబు తన ట్వీటర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌ నెక్ట్స్‌ సినిమా ఏంటి? అంటే.. మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్న మహేశ్‌ ఆ నెక్ట్స్‌ సుకుమార్‌ సినిమాలో హీరోగా నటిస్తారనే ఊహాగానాలు నెలకొన్నాయి. మహేశ్‌ కోసం సుకుమార్‌ కథ రెడీ చేస్తున్నారని, టూకీగా స్టోరీ లైన్‌ చెప్పారని కూడా ఫిల్మ్‌నగర్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ ఓ సినిమా చేయబోతున్నారని సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆ తర్వాత మహేశ్‌ తన ట్వీటర్‌ ద్వారా సుకుమార్‌తో సినిమా తన లేదని తెలిపారు. ‘‘క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల సుకుమార్‌తో నా సినిమా లేదు. తన కొత్త సినిమాకి నా శుభాకాంక్షలు. ఒక మంచి ఫిల్మ్‌ మేకర్‌ అంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది. ‘1 నేనొక్కడినే (సుకుమార్‌ డైరెక్షన్‌లో మహేశ్‌బాబు చేసిన సినిమా) ఎప్పటికీ ఒక ‘కల్ట్‌ క్లాసిక్‌’గా నిలిచిపోతుంది. ఆ సినిమాకి పని చేసిన ప్రతి నిమిషాన్ని ఎంజాయ్‌ చేశాను’’ అన్నారు మహేశ్‌బాబు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement