
విజయ్
‘తుపాకీ, కత్తి’ సినిమాల తర్వాత విజయ్ – మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. కళానిధి మారన్ నిర్మించారు. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘నవాబ్’ లాంటి సూపర్‌హిట్ తర్వాత ‘సర్కార్’ లాంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళంలో విడుదలైన ఫస్ట్ లుక్‌కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్ నిర్వహించి, నవంబర్ 6న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment