
కుంచె రఘు, ఎస్పీ బాలు
రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధ మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘ఓ సొగసరి...’ అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా ధ్యాన్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో మా సినిమా వస్తోంది. 1978లో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది.
మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ‘ఓ సొగసరి...’ పాటను పాడారు. బాలుగారు 30ఏళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే, బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్‌నెస్‌ను తీసుకువచ్చింది. లక్ష్మీ భూపాల్‌గారు ఈ పాటను చక్కగా రాశారు. కరుణ కుమార్‌కు ఇది తొలి చిత్రమైనా, రచయితగా సాహిత్యలోకంలో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి’’ అన్నారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ, కెమెరా: అరుల్ విన్సెంట్.
Comments
Please login to add a commentAdd a comment