టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది.
(ఇది చదవండి: మంచు మనోజ్ దంపతుల గొప్పమనసు.. ప్రెగ్నెన్సీ తర్వాత తొలిసారి!)
కాగా.. విజయ్, రష్మిక జంటగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఈ జోడీకి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లోనూ ఒకటి, రెండుసార్లు నెటిజన్లకు దొరికిపోయారు. కానీ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎక్కడా కూడా స్పందించలేదు. తాజాగా ఈ జంట ఎంగేజ్‌మెంట్‌కు సిద్ధమైనట్లు వార్తలు రావడంతో విజయ్ టీం క్లారిటీ ఇచ్చింది.
కాగా.. గతేడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్..ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడీగా కనిపించనుంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు యానిమల్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక.. అల్లు అర్జున్ సరసన పుష్ప-2లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment