ఆ చిత్రాలు ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతాయని అంటోంది నటి రష్మిక మందన్న. ఈ కర్ణాటక బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా కథానాయకిగా వెలిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈమె నట జర్నీ కేవలం మాత్రమే. కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరజ్‌పేటలో పుట్టిన ఈ అమ్మడు చదువు పూర్తయిన తరువాత ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత 2016లో మాతృభాషలో కిరిక్ పార్టీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఇప్పుడు అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న దక్షిణాది హీరోయిన్‌గా రాణిస్తోంది.
కాగా తన తొలి చిత్రం అనుభవాల గురించి రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ కన్నడ చిత్రం కిరిక్ పార్టీ చిత్రంలో నటించడానికి ఆ చిత్ర దర్శకుడు తనకు ఫోన్ చేశారని చెప్పింది. అయితే తనను ఆటపట్టించడానికి ఎవరో మాట్లాడుతున్నట్లు భావించిన తాను సినిమాలో నటించడానికి తనకు ఆసక్తి లేదని, ఫోన్ పెట్టమని చెప్పానంది. అంతేకాకుండా ఆ నంబర్‌ను తాను బ్లాక్ చేసినట్లు చెప్పింది.
అయితే నిర్మాత స్నేహితుడి ద్వారా ఆ దర్శకుడు తనతో మాట్లాడే ప్రయత్నం చేశారని చెప్పింది. చివరగా తాను చదువుకున్న ఉపాధ్యాయురాలు ద్వారా తనను కలుసుకున్నారని పేర్కొంది. అప్పుడు తాను ఆయనతో తనకు నటించడం రాదని చెప్పానని అయినప్పటికీ తనతో కొన్ని సంభాషణలను మాట్లాడించి రికార్డ్ చేసి ఆ తరువాత కిరిక్ పార్టీ చిత్రంలో కథానాయకిగా ఎంపిక చేశారని చెప్పింది. తాను కన్నడంలో కథానాయకిగా పరిచయమైన కిరిక్ పార్టీ, తమిళంలో ఎంట్రీ ఇచ్చిన సుల్తాన్, తెలుగులో పరిచయమైన సోలో, హిందీలో పరిచయమైన మిషన్ మజ్ను చిత్రాలు ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతాయని రష్మిక మందన్న పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment